
సాక్షి, తిరుమల : గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగుతుందని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రార్థిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment