విభజన హామీలు సాధించే వరకు పోరాడుతాం | Ysrcp MP's comments about state division guarantees | Sakshi
Sakshi News home page

విభజన హామీలు సాధించే వరకు పోరాడుతాం

Published Tue, Jul 18 2017 2:26 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

Ysrcp MP's comments about state division guarantees

స్పష్టం చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనే ముందు పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నివాసంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, బుట్టారేణుక, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. విభజన హామీలను సాధించుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు లాంటి హామీలను అమలు చేయాలని పార్లమెంటులో పట్టుబడతామని తెలిపారు.  అనంతరం ఎంపీలందరూ పార్లమెంటుకు కలసి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement