మర్యాదగా కలిసేందుకు వెళ్తే టీడీపీ కండువా వేశారు | ysrcp sarpanch speaks over tdp joining in krishna district | Sakshi
Sakshi News home page

మర్యాదగా కలిసేందుకు వెళ్తే టీడీపీ కండువా వేశారు

Published Sat, Dec 24 2016 4:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

మర్యాదగా కలిసేందుకు వెళ్తే టీడీపీ కండువా వేశారు - Sakshi

మర్యాదగా కలిసేందుకు వెళ్తే టీడీపీ కండువా వేశారు

గన్నవరం : జనచైతన్యయాత్ర నిమిత్తం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వెళ్లగా తన మెడలో పసుపు కండువా వేసి ఫొటోలు తీసి టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడాన్ని వైఎస్సార్‌సీపీకి చెందిన వీరపనేనిగూడెం గ్రామ సర్పంచి భూక్యా ఉమాదేవి ఖండించారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఆరుమాళ్ళ సాంబిరెడ్డి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...తను ఎప్పటికీ పార్టీ మారేదిలేదని తనకు రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చిన వైఎస్సార్‌ సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచిపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.గౌసాని పేర్కొన్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు బండి నాగసాంబిరెడ్డి, కార్యదర్శి బాణావతు గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement