పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు | YSRCP seeks disqualification of mptc who joined TDP | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు

Published Thu, Jul 3 2014 12:44 AM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు - Sakshi

పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు

 సాక్షి, ఏలూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడం ద్వారా స్థానిక సంస్థలను హస్తగతం చేసుకోవాలనుకుం టున్న తెలుగుదేశం పార్టీ కుతంత్రాలకు అడ్డుకట్ట వేసే ఆయుధాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్, డెప్యూటీ మేయర్, జిల్లాలోని మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పరి షత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ జారీ, బీ.ఫారం ఇచ్చే అధికారాన్ని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)కి అప్పగిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్లు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు ఆళ్ల నాని బుధవారం విప్ జారీ చేశారు. గురువారం నిర్వహించే మేయర్,
 3
 మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
 సాక్షి, ఏలూరు: మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.జిల్లాలోని 13 మండలాల్లో మహిళల అక్రమ రవాణా అధికంగా సాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా మండలాలతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 
 జువెనైల్ హోమ్‌లో చిన్నారులు వారి తల్లిదండ్రుల మధ్య ఉన్నట్లు భావించేలా సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిం చేందుకు కుటీర పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఓటరుకు సెల్‌ఫోన్, పేదలకు ఉచిత విద్య, రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, నిధుల కొరతవల్ల ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 21 ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు పర్యావరణ కమిటీకి ప్రతిపాదనలు పంపించామని, మరో 65 రీచ్‌లను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement