నేడు మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి | YSR's Fourth death anniversary today | Sakshi
Sakshi News home page

నేడు మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి

Published Mon, Sep 2 2013 3:07 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

నేడు మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి - Sakshi

నేడు మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ఇప్పటికే పిలుపునివ్వడం తెలిసిందే. అలాగే వర్ధంతి రోజున వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించాలని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేలా పైనుంచి ఆశీర్వదించాలని కోరుతూ ఆయన విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని కూడా కార్యకర్తలకు పిలుపునివ్వడమూ విదితమే.
 
ఈ నేపథ్యంలో రక్తదానాలు, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను వాడవాడలా నిర్వహించడానికి పార్టీ కార్యకర్తలు, నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతాయని పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement