శనగకు మద్దతు ధర ఇవ్వాలి | yv subbareddy demands for support price of Peanut Crop | Sakshi
Sakshi News home page

శనగకు మద్దతు ధర ఇవ్వాలి

Published Sat, Aug 2 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

శనగకు మద్దతు ధర ఇవ్వాలి

శనగకు మద్దతు ధర ఇవ్వాలి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: శనగ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆయ న శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. ప్రకాశం జిల్లాను పప్పు ధాన్యాల ఉత్పత్తి చేసే ప్రాంతంగా జాతీయ ఆహారభద్రత కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని, జిల్లాలో పొగాకు ఉత్పత్తులు తగ్గించేందుకు శనగను ప్రత్యామ్నాయ పంటగా ప్రోత్సహించాలని నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. జిల్లాలో శనగ విస్తీర్ణం పెరుగుతూ వస్తోందన్నారు.
 
శనగ పంట ఉత్పత్తి వ్యయం విత్తన రకం ఆధారంగా మారుతున్నందున కనీస మద్దతు ధర కూడా దాని ఆధారంగా నిర్ణయించాలని కోరారు. జెజీ-11, కెఒకె-2, బోల్డ్ రకాలకు కూడా ఒకే ధర ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం శనగ దిగుమతులపై సుంకం పెంచడంతో పాటు ఎగుమతులపై ప్రోత్సాహకాలు ప్రకటించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌లను ఆదేశించి అవి శనగలను కొనేవిధంగా చూడాలని కోరారు. జెజీ-11 రకానికి క్వింటాకు రూ.4 వేలు, కెఓకె-2 రకానికి రూ.4,500, బోల్డ్ రకానికి రూ.5 వేలు కనీస మద్దతు ధర ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
గత వారంలో ఒంగోలు వచ్చిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని శనగరైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే. 2012-13, 2013-14 సంవత్సరాల్లో పండించిన పంట ఇప్పటికే జిల్లాలోని కోల్డ్‌స్టోరేజీల్లో పేరుకుపోయిన విషయం ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement