వారిది అలక.. ఈమెకు కుదరక! | zp chairman chaudhry dhanlaxmi not focus on rule | Sakshi
Sakshi News home page

వారిది అలక.. ఈమెకు కుదరక!

Published Thu, Aug 7 2014 2:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

వారిది అలక.. ఈమెకు కుదరక! - Sakshi

వారిది అలక.. ఈమెకు కుదరక!

 శ్రీకాకుళం: ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకం కావడంతోపాటు అధికారిక సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వ, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ముఖ్యంగా అధికారక సమీక్ష సమావేశాల్లో పాల్గొంటేనే ప్రభుత్వ విభాగాలు, కార్యకలాపాలపై అవగాహన, పట్టు పెరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు జిల్లాలో అధికార పార్టీకి చెందిన  కొందరు పాలకులు, ప్రజాప్రతినిధులు వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చౌదరి ధనలక్ష్మి ఇంతవరకు జిల్లా పాలనపై దృష్టి పెట్టలేదు. కార్యాలయానికి రాలేదు. ఇక ఎచ్చెర్ల, పలాస ఎమ్మెల్యేలు సొంత పార్టీపై అలకబూని అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు.

 శుభ ముహూర్తం కుదర్లేదట!
 జెడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ధనలక్ష్మి ఇంతవరకు అధికారిక కార్యకలాపాల జోలికి వెళ్లలేదు. సుమారు మూడేళ్లపాటు పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడిన జిల్లాలో ఎట్టకేలకు ఎన్నికలు జరిగి.. జూలై 5న కొత్త చైర్‌పర్సన్ ఎన్నికయ్యారు. అదే రోజు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్‌పర్సన్ ధనలక్ష్మి తాగునీటి సమస్యకు సంబంధించిన మొదటి ఫైలుపై సంతకం చేశారు. అంతే ఆ తర్వాత నుంచీ అధికారిక కార్యకలాపా ల్లో పాల్గొనడం లేదు. అధికారులతో సమీక్షలు లేవు సరికదా.. చివరికి జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్న విషయాన్ని సైతం ఇప్పటి వరకు పట్టిం చుకోలేదు.

 జిల్లాకు పలువురు మంత్రు లు వస్తున్నారు. ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో చాలావాటికి కూడా ఆమె హాజరు కావడంలేదు. మం గళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చారు. జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. కీలకమైన ఈ సమావేశంలో చైర్‌పర్సన్ పాల్గొనలేదు. ఆషా ఢం, మూఢం వంటివి ఉన్నందున శుభ ముహూర్తం లేక అధికారిక కార్యకలాపాలు చేపట్టలేదని జె డ్పీవర్గాలు పేర్కొన్నాయి. అయితే శ్రావణమాసం ప్రారంభమై 15 రోజులు కావస్తోంది. బోల్డన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయి.

అయినా చైర్‌పర్సన్‌కు మాత్రం ఇంకా శుభ ముహూర్తం కుదర్లేదట! జిల్లా పరిపాలన కేంద్రం జిల్లా పరిషత్. దాని చైర్‌పర్సనే విధులకు రాకపోవడంతో ముఖ్యమైన ఫైళ్లు, కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాపరిషత్ పరిధిలో జరగాలిసన బదిలీలు, ఉద్యోగుల సీట్ల మార్పు, కారుణ్య నియామకాలు వంటివెన్నో నిలిచిపోయాయి. వాస్తవానికి ఇవన్నీ జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ ఆశావహుల సూచనల మేరకు అప్పట్లో వాయిదా వేశారు. చైర్‌పర్సన్ ఎన్నిక జరిగిన తర్వాత కూడా పనులన్నీ పెండింగులో ఉండిపోవడంతో జెడ్పీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరి చైర్‌పర్సన్‌కు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో.. సమస్యలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో!

 కినుక వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలు
 మరోవైపు ఎచ్చెర్ల, పలాస ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకట రావు, గౌతు శ్యామసుందర శివాజీలు సొంత పార్టీ నాయకత్వంపై కినుక వహించారు. ఇప్పటి వరకు మంత్రులు, విప్ నేతృత్వంలో జరిగిన ఏ సమీక్ష సమావేశానికి వీరు హాజరు కాలేదు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వీరిద్దరూ ఆనాటి నుంచి జిల్లా కేంద్రంలో జరిగిన అధికారిక సమీక్షలకు మొహం చాటేస్తున్నారు. తమకు పదవులు రాకుండా చేశారంటూ పార్టీ అధిష్టానంపైనా, జిల్లాలోని తమ ప్రత్యర్థి వర్గంపైనా అంతర్గతంగా నిప్పులు కక్కుతున్నారని తెలి సింది.

అయితే పార్టీపై ఉన్న కోపంతో ప్రజా సమస్యలను, అధికారిక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం తగదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జిలా ్లమంత్రితో పాటు పలు శాఖల మంత్రులు  జిల్లాస్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  సమావేశాల్లో ఈ ఇద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు పాల్గొని సమస్యలను లేవనెత్తారు.  

 నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమా ల్లో పాల్గొంటున్నప్పటికీ జిల్లాస్థాయిలో జరిగే సమావేశాలకు హాజరు కాకపోతే పలు సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతాయని సీనియర్ ఎమ్మెల్యేలైన కళా, గౌతులకుతెలియనిది కాకపోయినా.. వారు దాన్ని పట్టించుకోవడం లేదు. వీరి వైఖరి వల్ల తమ ప్రాంత సమస్యలు అధికారుల దృష్టికి వెళ్ల డం లేదని, ఆ రెండు ని యోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నాయకు లు పార్టీ అధినాయకునికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement