The Chieftains
-
తాగునీటి కోసం విలవిల
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు మందమర్రి రూరల్ : కాలం ఏదైనా వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేసవికాలం రాగానే ఇక్కడి పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది. గోంతు తడుపుకునేందుకు గుక్కేడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కాలనీలో మొత్తం 500 జనాభా ఉండగా, మంచినీటి పథకం కింద ఒక్క బోరు, నాలుగు చేతిపంపులు ఉన్నాయి. బోరు మోటారు కాలిపోయి ఇప్పటికీ 10 రోజులు గడస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాలుగు చేతిపంపుల్లో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. దీనితో తాగునీటికి కాలనీవాసులు విలవిలలాడుతున్నారు. మం డు టెండలో బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవ డం నరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మరో వారం రోజులు గడిస్తే ఉన్న ఆ రెం డు చేతి పంపులు కూడా పని చేయని పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే వచ్చే చిన్నదారతో కడువేడు నీరు నిండక చేతిపంపుల వద్ద పడిగాపులు కాయూల్సి వస్తుందని ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలో చెరువుగానీ, చెలిమలు గానీ లేకపోవడంతో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యమే తాగునీటి ఎద్దడికి ప్రధాన కారణం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ అధికారుల సమన్వయలోపంతో వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీవాసులు నీటికష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది తాగునీటి ఎద్దడిని నివారించేందుకు వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ నిధులతో 30 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న మూడు నీటి ట్యాంక్‌లను నిర్మించారు. ఒక్కోక్క ట్యాంక్‌కు రూ 18.50 లక్షలు ఖర్చు చేశారు. అవి ఇప్పటీకి వినియోగంలోకి రాలేదు. ట్యాంక్‌ల నిర్మాణం పూర్తరుుంది. భూగర్భపైపు లైన్లు వేశారు. కేవలం విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో నూతనంగా నిర్మించిన నీటి ట్యాంక్‌లు నిరుపయోగంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుగానే ఆదేశాలు జారీ చేసినా అవి ఫలించకపోవడం దురదుష్టకరం. ఇలా జరిగింది... ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఫిబ్రవరి 27, 2015 తేదీన విద్యుత్ శాఖకు రూ3,69 లక్షలు చెల్లించారు. కాగా వీరు డెలప్మెంట్ సెక్యూరిటీ పేరా చెల్లించాల్సిన బిల్లులను విద్యుత్ సర్వీస్ చార్జీల కింద చెల్లించారు. అప్పటీకే ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు విద్యుత్ బకాయిలు ఉండడంతో విద్యుత్ అధికారులు సర్వీస్ చార్జీల కింద బిల్లులు జమకట్టుకున్నారు. దీంతో ఈ మూడు ట్యాంక్‌లకు కరెంటు కనెక్షన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు రూ. 3.69 లక్షలు తిరిగి చెల్లిస్తే తప్ప కరెంటు కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సర్వీస్ బిల్లుల నుంచి కనెక్షన్ బిల్లులోకి మార్చుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దరఖాస్తు చేసినా, విద్యుత్ అధికారులు దానికి ససేమిరా అంటున్నారు. ఈ రెండుశాఖల సమన్వయలోపంతో ఎండాకాలం వెంకటాపూర్ ప్రజల గొంతు తడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరమైన నీటి సమస్య తీరుతుందనుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నీటి కటకట తప్పడం లేదు. వెంటనే ట్యాంకర్లకు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని, కాలిపోయిన బోరు, చేతిపంపులను మరమ్మతును వేగవంతగా చేసి తాగునీటి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. -
భూగర్భ డ్రెయినేజీకి అడ్డంకులెన్నో?
అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరంలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) తీసుకొస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే యూజీడీ రావాలంటే... ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మురికినీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలి. ఇదే ఇప్పుడు యూజీడీ ప్రాజెక్టుకు కీలక అడ్డంకిగా మారింది. స్థల సేకరణ జరగకపోతే యూజీడీ మంజూరు కాదు. ఈ విషయం ఇటు ప్రజాప్రతినిధులకు, అటు అధికారులకు తెలియంది కాదు. స్థల సేకరణ జరగనిదే ప్రాజెక్టు రాదని తెలిసి కూడా తెస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధులు ఈ విషయంలో ప్రజలకు ‘క్లారీటీ’ ఇవ్వాల్సి ఉంది. అనంతపురం నగరంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.368.08 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారు చేయడమే కాకుండా ఇందుకు సంబంధించి చెక్లిస్ట్ను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించి ఏడాదిన్నర గడుస్తోంది. ప్రాజెక్టు మంజూరులో కీలకంగా ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలం సేకరణపై దృష్టి పెట్టకపోవడమే ప్రాజెక్టు రాకకు గ్రహణంగా మారనుంది . స్థలం సేకరించాల్సి ఉంది. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం)-2 కింద అనంతపురం కార్పొరేషన్‌ను చేర్చింది. దీని ద్వారా నిధులు మంజూరు అవుతాయి. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు సంబంధించి నగ రాన్ని తొమ్మిది జోన్లుగా విభజించారు. ఈ తొమ్మిది జోన్లలో భూగర్భ డ్రై నేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.318.10 కోట్లుగా అంచనాలు తయారు చేశారు. రోజుకు 60 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసం రూ.16.97 కోట్లు అంచనా వేశారు. జాకింగ్ కోసం రూ.3.69 కోట్లు, మురుగునీటిని శుద్ధి చేసే పరికరాలకు రూ. 54 లక్షలుగా అంచనాలు సిద్ధం చేశారు. ఏడేళ్ల పాటు నిర్వహణకు రూ.6.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కంటింజెన్సీ ఖర్చులు 3 శాతంగా రూ.10.38 కోట్లు అంచనా వేశారు. మురుగునీటి శుద్ధం ప్లాంట్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించేందకు రూ.4 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. భూగర్భ డ్రై నేజీ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర సర్వే, డిజైన్ సిద్ధం చేసేందుకు రూ.61.06 లక్షలు, ఏడేళ్ళ విద్యుత్ చార్జీలకు రూ.7.08 కోట్లు ఖర్చు అవుతుందని చెక్‌లిస్ట్‌లో ఉంచారు. మొత్తంగా ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.368.08 కోట్లు అంచనా వ్యయంగా చూపించారు. శుద్ధి ప్లాంట్‌కు భూసేకరణ ప్రధానం భూగర్భ డ్రై నేజీ ఏర్పాటులో అత్యంత కీలకమైనది మురుగునీటి శుద్ధి ప్లాంట్. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అసవరమైన స్థలాన్ని సేకరించాలి. దీంతో బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లె సమీపంలో 230 ఎకరాలు భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో కొంత ప్రభుత్వ స్థలం కాగా దాదాపు 130 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.4 కోట్లు అవుతుందని అంచనా కూడా వేశారు. శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసం భూమిని సేకరించి సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ డాక్యుమెంట్‌ను, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తేనే ప్రాజెక్టు మంజూరవుతుంది. లేకపోతే ఇవ్వదు. జేఎన్ఎన్యూఆర్ఎం-1 మొదటి విడతలో కొన్ని కార్పొరేషన్లకు ఇదే పరిస్థితి ఏర్పడింది. శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు భూమిని సేకరించని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆక్కడ ప్రాజెక్టును మంజూరు చేయలేదు. ఇక్కడా మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు భూమిని సేకరించాల్సి ఉంది కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పాలకవర్గం చొరవ చూపాలి నగరానికి భూగర్భ డ్రైనేజీ ఆవశ్యం ఎంతో ఉంది. ఈ విషయంపై పాలకవర్గం చొరవ చూపిస్తే తప్ప ప్రక్రియ ముందుకు కదలదు. ప్రాజెక్టులో కీలకమైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలి. కేవలం రూ.4 కోట్లకు చూసుకుని స్థల సేకరణ జరపకపోతే ఏకంగా రూ.368 కోట్ల ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోతుందనేదాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. అదే జరిగితే భవిష్యత్తులో మళ్ళీ ప్రాజెక్టుని మంజూరు చేయించుకోవడం అంత సులవైన పనికాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఎత్తిపోతే?
అనంతపురం అగ్రికల్చర్ : కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య రేగిన వివాదం సద్దుమణగడం లేదు. దీంతో హంద్రీ-నీవాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘అనంత’కు కన్నీళ్లు మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సమయంలో చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటికి సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం రిజర్వాయర్‌లోని మిగులు జలాలపై హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు తొలి దశ మాత్రమే పూర్తి చేసుకున్న హంద్రీ-నీవా ద్వారా ఎత్తిపోతలతో కర్నూలు, అనంతపురం జిల్లాలకు కృష్ణా జలాలను తీసుకొస్తున్నారు. కర్నూలు జిల్లాలో క్రిష్ణగిరి, పత్తికొండ జలాశయాలతో పాటు, జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నారు. మూడేళ్ల నుంచి కృష్ణా జలాలు హంద్రీనీవా ద్వారా జిల్లాకు వస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో గతేడాది నుంచే వస్తున్నాయి. గతేడాది దాదాపు 6 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి. ఈ ఏడాది కూడా 10 టీఎంసీలు వచ్చే అవకాశముందని అధికారులు భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలంలో కనీస నీటిమట్టం పడిపోతున్నా కిందకు వదులుతూనే ఉంది. ప్రస్తుతం జలాశయంలో 857 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు సమాచారం. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చే యకుండా కొనసాగిస్తోంది. 830 అడుగుల వరకూ కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే జరిగితే శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకోవడానికి కుదరదు. ఇప్పటి వరకు 5.5 టీఎంసీల వరకూ నీటిని తీసుకున్నాం. తొలుత అధికారులు భావించిన విధంగా హంద్రీనీవాకు 10 టీఎంసీలకు పైగా నీరు వచ్చింటే జిల్లాలో నీటి ఇబ్బందులు తలెత్తేవి కావు. ఈ సమయంలో ఇరు రాష్ట్రాలు తీసుకునే నిర్ణయంపైనే జిల్లా రైతుల భవిష్యత్ అధారపడి ఉంది. ఈ సమయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చిత్తశుద్దితో వ్యవహరించి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. తుంగభద్ర లోటును తీరుస్తున్న కృష్ణమ్మ తుంగభద్ర జలాశయంలోకి ప్రతి ఏటా పూడిక వచ్చి చేరుతోందని సాకు చూపి హెచ్చెల్సీ కోటాలో భారీగా కోత విధిస్తున్నారు. నికరంగా 32 టీఎంసీలు జిల్లాకు రావాల్సి ఉన్నా కొన్నేళ్లుగా 22 టీఎంసీలు మించి జిల్లాకు రావడం లేదు. దీంతో హెచ్చెల్సీ కింద ఉన్న ఆయకట్టు బీడుగా మారుతోంది. ఈ ఏడాది కూడా హెచ్చెల్సీకి 22 టీఎంసీలు కేటాయించారు. ఏడాదికేడాది తుంగభద్రపై ఆశలు వదులుకునే పరిస్థితిలో హంద్రీ-నీవా ఆదుకుంటుందనే భరోసా పెరిగింది. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఈనరు రాకపోవడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. హెచ్చెల్సీతో పాటు, హంద్రీ-నీవాకు వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాణాళికలు రచించుకున్నారు. ఈ ఏడాది తాగునీటి అవసరాల కోసం 8.50 టీఎంసీలు నిల్వ చేసుకొని.. 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని భావించారు. దీంతో పీఏబీఆర్ కుడి కాల్వ కింద ఉన్న 49 చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. హెచ్చెల్సీ కింద మరో 20కి పైగా చెరువులను నింపాల్సి ఉంది. దీనికి తోడు చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ పరిస్థితిలో శ్రీశైలం జలాలు సముద్రం పాలవుతుండటం అగమ్య గోచరంగా తయారవుతోంది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పడిపోయి.. హంద్రీ-నీవాకు నీటి విడుదల ఆగిపోతే జిల్లా వాసులు తాగునీటికి సైతం ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజాప్రతినిధుల కేసులను వేగంగా విచారించాలి
అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ న్యూఢిల్లీ: అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయూలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేసులు నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో విచారణ రోజువారీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి ఎప్పటికప్పుడు విచారణను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల విచారణను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయూలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం కదిలింది. రెండేళ్లు, అంతకుమించి శిక్షకు గురైన చట్టసభ సభ్యులకు అనర్హత వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. కళంకిత సభ్యులపై చర్యలు చేపట్టి ఏడాదిలోగా రాజకీయూలను ప్రక్షాళన చేసేందుకు యంత్రాంగాన్ని రూపొందించాలని ప్రధాని నరేంద్రమోడీ గత జూలై 24వ తేదీన హోంశాఖ, న్యాయశాఖను ఆదేశించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రాలకు లేఖ రాయూలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా దీనికి సంబంధించి రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. హోంశాఖ లేఖలో ప్రధానాంశాలు.. ఆరోపణలు రుజువైన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలి. రోజువారీ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జడ్జిని కోరాలి. ప్రాసిక్యూటర్ల కొరత ఉంటే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాష్ట్రాలు నియమించాలి. కేసు విచారణ పురోగతిని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు సమీక్షిస్తే మంచిది. ప్రాసిక్యూషన్‌కు మద్దతుగా సాక్ష్యాలు, వైద్య నివేదికలు ప్రవేశపెట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కేసులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థారుులో సమన్వయ కమిటీని నియమించాలి. జిల్లా సెషన్స్ జడ్జి దీనికి నేతృత్వం వహిస్తారు. -
వారిది అలక.. ఈమెకు కుదరక!
శ్రీకాకుళం: ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకం కావడంతోపాటు అధికారిక సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వ, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ముఖ్యంగా అధికారక సమీక్ష సమావేశాల్లో పాల్గొంటేనే ప్రభుత్వ విభాగాలు, కార్యకలాపాలపై అవగాహన, పట్టు పెరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు పాలకులు, ప్రజాప్రతినిధులు వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చౌదరి ధనలక్ష్మి ఇంతవరకు జిల్లా పాలనపై దృష్టి పెట్టలేదు. కార్యాలయానికి రాలేదు. ఇక ఎచ్చెర్ల, పలాస ఎమ్మెల్యేలు సొంత పార్టీపై అలకబూని అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. శుభ ముహూర్తం కుదర్లేదట! జెడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ధనలక్ష్మి ఇంతవరకు అధికారిక కార్యకలాపాల జోలికి వెళ్లలేదు. సుమారు మూడేళ్లపాటు పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడిన జిల్లాలో ఎట్టకేలకు ఎన్నికలు జరిగి.. జూలై 5న కొత్త చైర్పర్సన్ ఎన్నికయ్యారు. అదే రోజు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్పర్సన్ ధనలక్ష్మి తాగునీటి సమస్యకు సంబంధించిన మొదటి ఫైలుపై సంతకం చేశారు. అంతే ఆ తర్వాత నుంచీ అధికారిక కార్యకలాపా ల్లో పాల్గొనడం లేదు. అధికారులతో సమీక్షలు లేవు సరికదా.. చివరికి జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్న విషయాన్ని సైతం ఇప్పటి వరకు పట్టిం చుకోలేదు. జిల్లాకు పలువురు మంత్రు లు వస్తున్నారు. ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో చాలావాటికి కూడా ఆమె హాజరు కావడంలేదు. మం గళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చారు. జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. కీలకమైన ఈ సమావేశంలో చైర్పర్సన్ పాల్గొనలేదు. ఆషా ఢం, మూఢం వంటివి ఉన్నందున శుభ ముహూర్తం లేక అధికారిక కార్యకలాపాలు చేపట్టలేదని జె డ్పీవర్గాలు పేర్కొన్నాయి. అయితే శ్రావణమాసం ప్రారంభమై 15 రోజులు కావస్తోంది. బోల్డన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయి. అయినా చైర్‌పర్సన్‌కు మాత్రం ఇంకా శుభ ముహూర్తం కుదర్లేదట! జిల్లా పరిపాలన కేంద్రం జిల్లా పరిషత్. దాని చైర్‌పర్సనే విధులకు రాకపోవడంతో ముఖ్యమైన ఫైళ్లు, కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాపరిషత్ పరిధిలో జరగాలిసన బదిలీలు, ఉద్యోగుల సీట్ల మార్పు, కారుణ్య నియామకాలు వంటివెన్నో నిలిచిపోయాయి. వాస్తవానికి ఇవన్నీ జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ ఆశావహుల సూచనల మేరకు అప్పట్లో వాయిదా వేశారు. చైర్పర్సన్ ఎన్నిక జరిగిన తర్వాత కూడా పనులన్నీ పెండింగులో ఉండిపోవడంతో జెడ్పీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరి చైర్‌పర్సన్‌కు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో.. సమస్యలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో! కినుక వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరోవైపు ఎచ్చెర్ల, పలాస ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకట రావు, గౌతు శ్యామసుందర శివాజీలు సొంత పార్టీ నాయకత్వంపై కినుక వహించారు. ఇప్పటి వరకు మంత్రులు, విప్ నేతృత్వంలో జరిగిన ఏ సమీక్ష సమావేశానికి వీరు హాజరు కాలేదు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వీరిద్దరూ ఆనాటి నుంచి జిల్లా కేంద్రంలో జరిగిన అధికారిక సమీక్షలకు మొహం చాటేస్తున్నారు. తమకు పదవులు రాకుండా చేశారంటూ పార్టీ అధిష్టానంపైనా, జిల్లాలోని తమ ప్రత్యర్థి వర్గంపైనా అంతర్గతంగా నిప్పులు కక్కుతున్నారని తెలి సింది. అయితే పార్టీపై ఉన్న కోపంతో ప్రజా సమస్యలను, అధికారిక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం తగదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జిలా ్లమంత్రితో పాటు పలు శాఖల మంత్రులు జిల్లాస్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ఈ ఇద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు పాల్గొని సమస్యలను లేవనెత్తారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమా ల్లో పాల్గొంటున్నప్పటికీ జిల్లాస్థాయిలో జరిగే సమావేశాలకు హాజరు కాకపోతే పలు సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతాయని సీనియర్ ఎమ్మెల్యేలైన కళా, గౌతులకుతెలియనిది కాకపోయినా.. వారు దాన్ని పట్టించుకోవడం లేదు. వీరి వైఖరి వల్ల తమ ప్రాంత సమస్యలు అధికారుల దృష్టికి వెళ్ల డం లేదని, ఆ రెండు ని యోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నాయకు లు పార్టీ అధినాయకునికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.