- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
మందమర్రి రూరల్ : కాలం ఏదైనా వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేసవికాలం రాగానే ఇక్కడి పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది. గోంతు తడుపుకునేందుకు గుక్కేడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కాలనీలో మొత్తం 500 జనాభా ఉండగా, మంచినీటి పథకం కింద ఒక్క బోరు, నాలుగు చేతిపంపులు ఉన్నాయి. బోరు మోటారు కాలిపోయి ఇప్పటికీ 10 రోజులు గడస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు.
నాలుగు చేతిపంపుల్లో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. దీనితో తాగునీటికి కాలనీవాసులు విలవిలలాడుతున్నారు. మం డు టెండలో బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవ డం నరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మరో వారం రోజులు గడిస్తే ఉన్న ఆ రెం డు చేతి పంపులు కూడా పని చేయని పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే వచ్చే చిన్నదారతో కడువేడు నీరు నిండక చేతిపంపుల వద్ద పడిగాపులు కాయూల్సి వస్తుందని ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలో చెరువుగానీ, చెలిమలు గానీ లేకపోవడంతో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామన్నారు.
అధికారుల నిర్లక్ష్యమే తాగునీటి ఎద్దడికి ప్రధాన కారణం
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ అధికారుల సమన్వయలోపంతో వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీవాసులు నీటికష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది తాగునీటి ఎద్దడిని నివారించేందుకు వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్‌డబ్ల్యూఎస్ నిధులతో 30 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న మూడు నీటి ట్యాంక్‌లను నిర్మించారు. ఒక్కోక్క ట్యాంక్‌కు రూ 18.50 లక్షలు ఖర్చు చేశారు. అవి ఇప్పటీకి వినియోగంలోకి రాలేదు. ట్యాంక్‌ల నిర్మాణం పూర్తరుుంది. భూగర్భపైపు లైన్లు వేశారు. కేవలం విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో నూతనంగా నిర్మించిన నీటి ట్యాంక్‌లు నిరుపయోగంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుగానే ఆదేశాలు జారీ చేసినా అవి ఫలించకపోవడం దురదుష్టకరం.
ఇలా జరిగింది...
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఫిబ్రవరి 27, 2015 తేదీన విద్యుత్ శాఖకు రూ3,69 లక్షలు చెల్లించారు. కాగా వీరు డెలప్‌మెంట్ సెక్యూరిటీ పేరా చెల్లించాల్సిన బిల్లులను విద్యుత్ సర్వీస్ చార్జీల కింద చెల్లించారు. అప్పటీకే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ వారు విద్యుత్ బకాయిలు ఉండడంతో విద్యుత్ అధికారులు సర్వీస్ చార్జీల కింద బిల్లులు జమకట్టుకున్నారు. దీంతో ఈ మూడు ట్యాంక్‌లకు కరెంటు కనెక్షన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు రూ. 3.69 లక్షలు తిరిగి చెల్లిస్తే తప్ప కరెంటు కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు.
సర్వీస్ బిల్లుల నుంచి కనెక్షన్ బిల్లులోకి మార్చుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు దరఖాస్తు చేసినా, విద్యుత్ అధికారులు దానికి ససేమిరా అంటున్నారు. ఈ రెండుశాఖల సమన్వయలోపంతో ఎండాకాలం వెంకటాపూర్ ప్రజల గొంతు తడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరమైన నీటి సమస్య తీరుతుందనుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నీటి కటకట తప్పడం లేదు. వెంటనే ట్యాంకర్లకు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని, కాలిపోయిన బోరు, చేతిపంపులను మరమ్మతును వేగవంతగా చేసి తాగునీటి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
తాగునీటి కోసం విలవిల
Published Fri, May 8 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement