శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువుచైత్ర మాసం, తిథి బ.నవమి రా.9.14 వరకు, తదుపరి దశమినక్షత్రం శ్రవణం రా.1.54 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం... లేదుదుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకు, అమృతఘడియలు... ప.3.00 నుంచి 4.40 వరకు.
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం
వృషభం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవేత్తలకు చికాకులు.
మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కళాకారులకు కొంత గందరగోళం.
కర్కాటకం :శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.
సింహం: కుటుంబంలో శుభకార్యాలు.ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.
కన్య :కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ప్రయాణాలు వాయిదా. కళాకారులకు ఒత్తిడులు
తుల: వ్యయప్రయాసలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం :కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫలం.
ధనుస్సు :ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు కొంత నిరాశ.
మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు.
మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళాకారులకు నూతనోత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment