
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.అష్టమి ప.11.38 వరకు, తదుపరి నవమి, నక్షత్రం మఖ సా.6.52 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం ఉ.7.36 నుంచి 9.06 వరకు, తిరిగి రా.2.18 నుంచి 3.48 వరకు, దుర్ముహూర్తం ప.11.22 నుంచి 12.06 వరకు, అమృతఘడియలు... సా.4.36 నుంచి 6.03 వరకు.
సూర్యోదయం : 6.11
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వృషభం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
మిథునం: నూతన వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలు సానుకూలం. వస్తు, వస్త్రలాభాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం: పనుల్లో స్తబ్ధత. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.
సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.
కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అయోమయస్థితి.
తుల: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి, ధనలాభాలు. మిత్రులతో సఖ్యత. కొన్ని వివాదాలు సద్దుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
వృశ్చికం: ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. బంధువర్గంతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు రద్దు. బం«ధువులతో తగాదాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అసంతృప్తి.
కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
మీనం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుముడులు వీడతాయి.
– సింహంభట్ల సుబ్బారావు