
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి బ.దశమి ఉ.6.48 వరకు, తదుపరి ఏకాదశి తె.4.47 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం ఉత్తర ప.3.31 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.11.22 నుంచి 12.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.24 నుంచి 9.11 వరకు, తదుపరి ప.12.07 నుంచి 12.54 వరకు అమృతఘడియలు... ఉ.8.45 నుంచి 9.43 వరకు.
సూర్యోదయం : 6.11
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. దైవచింతన.
మిథునం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
కర్కాటకం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు ఊరట. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
సింహం: దూరప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. నిరుద్యోగుల య త్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
కన్య: దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గల దీర్ఘకాలిక చిక్కుల నుంచి బయటపడతారు.
తుల: అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
వృశ్చికం: ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
ధనుస్సు: ముఖ్య వ్యవహారాలలో పురోగతి. నూతన విద్యావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాల వైపు సాగుతారు.
మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.
కుంభం: వ్యవహారాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సఖ్యత. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment