అదానీ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్ట్ పై మరో వివాదం | Adani's mine project in Australia faces fresh legal hurdle | Sakshi
Sakshi News home page

అదానీ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్ట్ పై మరో వివాదం

Published Thu, Apr 14 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

అదానీ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్ట్ పై మరో వివాదం

అదానీ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్ట్ పై మరో వివాదం

మెల్‌బోర్న్: అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన మైనింగ్ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో న్యాయ వివాదం చోటు చేసుకుంది.  అదానీ సంస్థ క్వీన్స్‌లాండ్‌లోని గలిలీ బేసిన్‌లో 1,200 కోట్ల డాలర్ల మైనింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన లీజ్‌లను   సవాల్ చేస్తూ, ఈ గలిలీ బేసిన్ పాత యాజమాన్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ  వాన్‌గన్ అండ్ జగలిన్‌గావూ(డబ్ల్యూ అండ్ జే) సంస్థ  ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో తాజాగా  కేసు దాఖలు చేసింది. తమ ఆమోదం లేకుండానే ఈ మైనింగ్ లీజ్‌లు అదానీ సంస్థకు ఇచ్చారని డబ్ల్యూ అండ్ జే  సంస్థ పేర్కొంది. అయితే గలిలీ బేసిన్ గత యజమానులకు డబ్ల్యూ అండ్ జే గ్రూప్ పూర్తిగా ప్రాతినిధ్యం వహించడం లేదని, ఈ కేసు దాఖలు చేయడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని అదానీ గ్రూప్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement