రూ. 1,799కే ఎయిర్ కోస్టా టికెట్లు! | air costa announces happy sankranthi offer | Sakshi
Sakshi News home page

రూ. 1,799కే ఎయిర్ కోస్టా టికెట్లు!

Published Tue, Jan 13 2015 3:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

రూ. 1,799కే ఎయిర్ కోస్టా టికెట్లు!

రూ. 1,799కే ఎయిర్ కోస్టా టికెట్లు!

సంక్రాంతి సందర్భంగా విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా కొత్త ఆఫర్ ప్రకటించింది. 'హ్యాపీ సంక్రాంతి' పేరుతో తక్కువ ధరకే విమాన యానం అందించే ఈ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. పండుగలు, సెలవులను దృష్టిలో పెట్టుకుని రూ. 1,799 నుంచే టికెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

జనవరి 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి జనవరి 15 మధ్యాహ్నం 3 గంటలలోపు బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement