
ఎయిర్ కోస్టా న్యూ ఇయర్ ఆఫర్లు
రాబోయే కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కోస్టా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 11 మధ్యాహ్నం మూడు గంటల నుంచి డిసెంబర్ 15 మూడు గంటల లోపు టికెట్లను బుక్ చేసుకున్న వారికి తగ్గింపు ధరలకే టికటెట్లు అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
ఈసమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, చెన్నై, తిరుపతి నగరాలకురూ. 2015, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లకు రూ. 2499, విజయవాడ నుంచి తిరుపతి, విశాఖపట్నం రూ. 2499కే ప్రయాణాలు చేయొచ్చు. మరికొన్ని పట్టణాల మధ్య రూ. 2015 నుంచి రూ. 3499కే ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తోంద.ఇ ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో 2015 ఫిబ్రవరి 1 నుంచి 2015 ఏప్రిల్ 15లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.