అలెంబిక్‌ ఫార్మా- ర్యాలీస్‌.. దూకుడు | Alembic Pharma- Rallis India jumps | Sakshi
Sakshi News home page

అలెంబిక్‌ ఫార్మా- ర్యాలీస్‌.. దూకుడు

Published Mon, Jul 20 2020 2:49 PM | Last Updated on Mon, Jul 20 2020 2:49 PM

Alembic Pharma- Rallis India jumps - Sakshi

అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌
డయాబెటిక్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు వెల్లడించడంతో అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 1029 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1040 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఎంపగ్లిఫోజిన్, మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ట్యాబ్లెట్లకు యూఎస్‌ నుంచి అనుమతి లభించినట్లు అలెంబిక్‌ తెలియజేసింది. వీటిని 5ఎంజీ/500 ఎంజీ, 5ఎంజీ/1000 ఎంజీ, 12.5ఎంజీ/500 ఎంజీ, 12.5ఎంజీ/1000 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు వెల్లడించింది. బోరింగర్‌ ఫార్మా తయారీ సింజార్డీ ట్యాబ్లెట్లకు ఇవి జనరిక్ వెర్షన్‌కాగా.. గ్లైసమిక్‌ నియంత్రణకు వినియోగపడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వీటికి 17.2 కోట్ల డాలర్ల(రూ. 1300 కోట్లు) మార్కెట్‌ ఉన్నట్లు అంచనా.

ర్యాలీస్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్‌ జున్‌జున్‌వాలా అదనంగా 7.25 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ర్యాలీస్‌ ఇండియా కౌంటర్ జోరందుకుంది. ఈ టాటా గ్రూప్‌ కంపెనీలో తాజాగా రాకేష్ వాటా 10.31 శాతానికి ఎగసినట్లు తెలుస్తోంది. వెరసి 2016 మార్చి తదుపరి ర్యాలీస్‌ ఇండియాలో తిరిగి రాకేష్‌ వాటా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ర్యాలీస్‌ ఇండియా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 301ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 295 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 24న నమోదైన కనిష్టం రూ. 127 నుంచి ర్యాలీస్‌ ఇండియా కౌంటర్‌ 136 శాతం ర్యాలీ చేయడం విశేషం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement