భారత్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో ఊరటనిచ్చింది. పారి శ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత కర్మాగారాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్‌లో 4.1 శాతంగా నమోదయ్యింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం పురోగతి మొత్తం సూచీని తగిన స్థాయిలో ఉంచింది. అయితే డిమాండ్‌కు సూచిక అయిన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం వృద్ధి వేగం తగ్గింది.
ఇదిలావుండగా, 2014 ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.7 శాతం. 2015 మార్చికి సంబంధించి తొలి గణాంకం 2.1 శాతాన్ని 2.5 శాతానికి కేంద్ర గణాంకాల కార్యాలయం సవరించింది. తయారీ రంగం ఏప్రిల్‌లో 5.1 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014 ఇదే నెలలో ఈ రేటు 3%. తయారీ రంగానికి సంబంధించి మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానూకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
తయారీ రంగం దన్ను!
Published Mon, Jun 15 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM
Advertisement