
ఎగవేతల్లో ఎస్‌బీఐ వాటానే 27 శాతం
ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన మొత్తం రుణాల్లో ఒక్క ఎస్‌బీఐ వాటానే 27%. మార్చి నాటికి ఎస్‌బీఐకి 1,762 మంది రూ.25,104 కోట్ల మేర రుణాలను చెల్లించకుండా ఎగ్గొట్టారు.
తర్వాతి స్థానం పంజాబ్ నేషనల్ బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన మొత్తం రుణాల్లో ఒక్క ఎస్‌బీఐ వాటానే 27%. మార్చి నాటికి ఎస్‌బీఐకి 1,762 మంది రూ.25,104 కోట్ల మేర రుణాలను చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఆ తర్వాత ఆ స్థాయిలో రుణాల పరంగా నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. పీఎన్‌బీకి 1,120 మంది రూ.12,278 కోట్లు చెల్లించలేదు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల మొత్తం 2017 మార్చి నాటికి రూ.92,376 కోట్లుగా ఉంది. 8,915 మంది వీటిని చెల్లించాల్సి ఉంది. ఇందులో ఎస్‌బీఐ, పీఎన్‌బీ బ్యాంకుల వాటాయే 40% వాటా (రూ.37,382 కోట్లు).