ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎస్‌బీఐ, యూనియన్‌బ్యాంకులు రూ.2,836 కోట్ల వసూలు కాని మొండి రుణాలను (ఎన్‌పీఏ) వేలం వేయనున్నాయి. రూ.1,555 కోట్ల విలువైన ఎన్‌పీఏలను ఎస్‌బీఐ వేలానికి ఉంచింది. అలాగే, 11 ఎన్‌పీఏల ఖాతాలకు సంబంధించి రూ.1,281 కోట్ల రుణ ఆస్తుల వేలానికి బిడ్లను యూనియన్ బ్యాంకు ఆహ్వానించింది. ఈ నెల్లోనే ఈవేలం ద్వారా వీటిని అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించనున్నాయి. ఎస్‌బీఐ వేలానికి ఉంచిన వాటిల్లో రోహిత్ ఫెర్రోటెక్ రూ.1,313.67 కోట్లు, ఇంపెక్స్ ఫెర్రోటెక్ రూ.200.67 కోట్లు, అవని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్‌ఫ్రా రూ.40.53 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. యూనియన్ బ్యాంకు వేలానికి ఉంచిన వాటిల్లో జీవీకే పవర్ గోయిండ్వాల్‌సాహెబ్ (రూ.444 కోట్లు), రాజమండ్రి గోదావరి బ్రిడ్జి (రూ.153 కోట్లు) తదితర ఖాతాలు ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment