ఆటో ఎక్స్ పో.. రెండో రోజూ సందడి | Auto Expo 2016 Day 2: Mega car show open to public now : Top News, News | Sakshi
Sakshi News home page

ఆటో ఎక్స్ పో.. రెండో రోజూ సందడి

Published Fri, Feb 5 2016 1:37 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

ఆటో ఎక్స్ పో.. రెండో రోజూ సందడి - Sakshi

ఆటో ఎక్స్ పో.. రెండో రోజూ సందడి

గ్రేటర్ నోయిడా: ఆటో షో రెండో రోజు కూడా సందడిగా సాగింది. పలు కంపెనీలు కొత్త కార్లను ఆవిష్కరించాయి. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుండటంతో పర్యావరణానికి అనుకూల వాహనాలకే పెద్ద పీట వేస్తున్నామని పలు కంపెనీలు పేర్కొన్నాయి. బీఎస్-సిక్స్ పర్యావరణ నిబంధనలను 2020 నుంచి  అమలు చేయడం తప్పనిసరి చేస్తామని రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.

ఈ నిబంధనలకు అనుగుణమైన ఇంధనాలు లభిస్తాయో లేదో నన్న ఆందోళన, భయాలు పెట్టుకోవద్దని వాహన కంపెనీలకు ఆయన అభయం ఇచ్చారు. ఈ నిబంధనలకు తగ్గట్లుగా ఇంజిన్లను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించాలని వాహన కంపెనీలను ఆయన కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. రానున్న బడ్జెట్లో వాహన రంగానికి మేలు చేసే కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు.

మహీంద్రా: కంపెనీ కొత్త కాన్సెప్ట్ కూపే ఎక్స్‌యూవీ ఏరోను ఆవిష్కరించింది. కొరియా భాగస్వామి సాంగ్‌యాంగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టివొలిని కూడా డిస్‌ప్లే చేసింది. బ్లేజ్ బ్రాండ్‌తో కొత్త రేంజ్ ట్రక్కులను, ఎలక్ట్రిక్ కారు ఈ20లో స్పోర్ట్స్‌ను వేరియంట్‌ను ఆవిష్కరించింది.

హ్యుందాయ్:   4 మీ. లోపు ఎస్‌యూవీ కాన్సెప్ట్ కారు కార్లినోను ఆవిష్కరించింది. తామందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఇదని కంపెనీ పేర్కొంది.

మారుతీ సుజుకీ: ఈ ఏడాది పండుగల సీజన్ కల్లా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ కార్ ఇగ్నిస్‌ను, ప్రీమియం స్పోర్ట్స్ హ్యాచ్‌బాక్  బాలెనొ ఆర్‌ఎస్‌ను అందిస్తామని  తెలిపింది.  ఈ మోడళ్లకు చెందిన కాన్సెప్ట్ కార్లను మారుతీ ఆవిష్కరించింది.

టాటా మోటార్స్: నిర్మాణ రంగం కోసం సిగ్నా రేంజ్ వాణిజ్య వాహనాలను ఆవిష్కరించింది.  సిగ్నాలో ట్రాక్టర్, ట్రక్కు, టిప్పర్‌లను డిస్‌ప్లే చేసింది. ఆల్ట్రా 1518 పేరుతో మధ్య తరహా, తేలిక రకం వాణిజ్య వాహనాన్ని కూడా ఆవిష్కరించింది. భవిష్యత్ అవసరాల కోసం హైబ్రిడ్ వాహనాలను అందించనున్నామని పేర్కొంది. హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్-సెల్ టెక్నాలజీలతో రూపొందించే మ్యాజిక్ ఐరిస్ జివా, టాటా స్టార్‌బస్ హైబ్రిడ్, టాటా ఐస్ మెగా ఎక్స్‌ఎల్‌ను అందిస్తున్నామని వివరించింది.

కొత్త డస్టర్: రెనో కంపెనీ అంతా కొత్తదైన డస్టర్ మోడల్‌ను ఆవిష్కరించింది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఈ కారు ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఫోక్స్‌వ్యాగన్: స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్ పొలో జీటీఐను ఆవిష్కరించింది. 7 స్పీడ్ గేర్ బాక్స్  ఈ కారు ప్రత్యేకత. ఏబీఎస్, ఈఎస్‌పీ, హిల్-హోల్డ్ వంటి ఫీచర్లున్నాయని పేర్కొంది.

 బీఎండబ్ల్యూ: ఈ ఏడాది జూన్‌కల్లా మినీ కన్వర్టబుల్‌ను అందుబాటులోకి తెస్తామని బీఎండబ్ల్యూ తెలిపింది. మినీ క్లబ్‌మేన్ కారును కూడా త్వరలోనే భారత్‌కు తెస్తామని పేర్కొంది.

ఫియట్ క్రిస్లర్: పంటో ప్యూర్ కారును ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కార్ల ధరలు రూ.4.49 లక్షల నుంచి రూ.5.49 లక్షల రేంజ్‌లో ఉన్నాయని పేర్కొంది.  దీంతో పాటు లినియా 125 ఎస్, అవెంచుర అర్బన్ క్రాస్‌ను  కూడా డిస్‌ప్లే చేసింది. వీటిని ఈ ఏడాదే భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది.

ఆడి: ఆడి కార్లలోనే అత్యంత సురక్షితమైన ఏ8 ఎల్ సెక్యూరిటీ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ కార్ల ధరలు రూ.9.15 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

టయోటా ప్రియస్: అంతా కొత్తదైన హైబ్రిడ్ కారు ప్రియుస్‌ను టయోటా కంపెనీ ఆవిష్కరించింది. పర్యావరణ అనుకూల వాహనాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొంది. ఈ కారు ధర రూ.38.1 లక్షలు.

నిస్సాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా జాన్ అబ్రహం: భవిష్యత్తులో భారత్‌లో నిస్సాన్ అందించే బ్రాండ్లకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. స్పోర్ట్స్ కారు జీటీఆర్, హైబ్రిడ్ ఎస్‌యూవీ ఎక్స్‌ట్రయిల్‌ను త్వరలో అందిస్తామని నిస్సాన్  పేర్కొంది. ఈ ఏడాది ఎక్స్‌ట్రయల్ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ క్రాసోవర్‌ను అందించనున్నామని పేర్కొంది. భారత్‌లో ఇదే తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement