
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ గత ఆర్థిక సంవత్సరం (2017–18) రూ.2.91 కోట్ల బేసిక్ వేతనం అందుకున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈమె అందుకున్న 2.7 కోట్ల వేతనంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరపు వేతనం 7.8 శాతం పెరిగింది. బ్యాంక్ 2017–18 వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
శిఖా శర్మ ఇంటి అద్దె అలవెన్స్ కింద రూ.97.05 లక్షలు, లీవ్ ఫేర్ కన్సెషన్ కింద రూ.14.76 లక్షలు, ఇతర భత్యాలు (ఈసాప్స్ మినహా) కింద రూ.32.08 లక్షలు, వేరియబుల్ వేతనం కింద (2013–14, 2014–15కి గానూ) రూ.44.1 లక్షలు అందుకున్నారు. దీనికి వృద్ధాప్య అలవెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటివి అదనం. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థూల వేతనం రూ.4.88 కోట్లు. దీనికి 5.4 లక్షల స్టాక్ ఆప్షన్స్ అదనం.
Comments
Please login to add a commentAdd a comment