బజాజ్ డిస్కవర్, ప్లాటినా రేట్ల పెంపు! | Bajaj Auto may hike prices of Discover, Platina models from January | Sakshi

బజాజ్ డిస్కవర్, ప్లాటినా రేట్ల పెంపు!

Published Sat, Dec 6 2014 12:26 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

బజాజ్ డిస్కవర్, ప్లాటినా రేట్ల పెంపు! - Sakshi

బజాజ్ డిస్కవర్, ప్లాటినా రేట్ల పెంపు!

దేశీ వాహన దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ డిస్కవర్, ప్లాటినా బైక్‌ల ధరలను పెంచాలని యోచిస్తోంది.

న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ డిస్కవర్, ప్లాటినా బైక్‌ల ధరలను పెంచాలని యోచిస్తోంది. వచ్చే నెలలో ఈ బైక్‌ల ధరలను పెంచాలని యోచిస్తున్నామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(మోటార్ సైకిళ్ల విభాగం) ఎరిక్ వ్యాస్ శుక్రవారమిక్కడ తెలిపారు. కార్మికుల వేతనాలు, విద్యుత్ చార్జీలు, తదితర ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని, దీనిని తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించారు. ధరలను ఎంత శాతం పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ బైక్‌ల అమ్మకాల పనితీరు, ఎక్సైజ్ సుంకం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ధరలు ఎంత పెంచాలన్నది నిర్ణయిస్తామని వివరించారు.

నవంబర్ నెలలో మోటార్ బైక్‌ల అమ్మకాలు 6 శాతం తగ్గాయని, ఈ నెలలో కూడా ఇదే స్థాయి అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు వ్యాస్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రధాన మోడల్ పల్సర్ బైక్‌ల ధరలను ఈ కంపెనీ రూ.1,000 వరకూ పెంచడం తెలిసిందే.  ప్లాటినా, డిస్కవర్ బైక్‌లతో పాటు పల్సర్, అవెంజర్, నింజా తదితర  బైక్‌లను బజాజ్ ఆటో విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement