ఆర్థికాభివృద్ధికి సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మనం ఎంతో కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఈ దిశలో తీసుకునే చర్యల అమల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులదే కీలక పాత్ర. మొండి బకాయిల (ఎన్‌పీఏ)ల వంటి సమస్యలు ఉన్నప్పటికీ, వీటన్నింటినీ అధిగమించే సత్తా ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి ఉందని ఫండమెంటల్స్ పేర్కొంటున్నాయి.
బాసెల్-3 ప్రమాణాలకు సిద్ధం
భారత్ బ్యాంకులు అంతర్జాతీయ ప్రమాణాలు- బాసెల్ 3కి తగిన నిధుల సమీకరణకు సిద్ధంగా ఉన్నాయి. పబ్లిక్‌కు ఈక్విటీల జారీ, 51 శాతానికి తగ్గకుండా ప్రభుత్వ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ వంటి కీలక నిర్ణయాల దిశలో త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. రానున్న నాలుగేళ్లలో తాజా మూలధన సమీకరణ లక్ష్యాలను సాధించే వీలుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి హోల్డింగ్ కంపెనీ వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుత అంశానికి వస్తే, దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులూ నిర్దేశిత 9%కి పైగా మూలధనాన్ని కలిగి ఉన్నాయి. రుణ వృద్ధికి తద్వారా అధిక ఆర్థికాభివృద్ధి రేటును సాధించడానికి ఇది కలిసి వచ్చే అంశం.
తగ్గుతున్న మొండిబకాయిలు
బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం మొండి బకాయిలు (ఎన్‌పీఏ) ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. అయితే ఇటీవలి కాలంలో ఎన్‌పీఏల స్పీడ్ తగ్గడం హర్షణీయ పరి ణామం. అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీ) బ్యాంకుల మొండి బకాయిల అసెట్స్ విక్రయం ఇం దులో కీలక పాత్ర పోషిస్తోంది. బ్యాంకింగ్, ఏఆర్‌సీలు సంయుక్తంగా ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తున్నాయి. ఇక రుణాల రికవరీ దిశలో సర్‌ఫేసీ (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ) చట్టం పటిష్టవంతానికి రిజర్వ్ బ్యాంక్ కసరత్తు ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులపై చర్యలు సైతం వేగవంతం అవుతున్నాయి. ప్రభుత్వం సైతం ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటోంది.
పెట్టుబడులకు ‘రహదారి’!
కుంభకోణాల కట్టడికిగాను బ్యాంకింగ్ ఉన్నత స్థాయిలో మరింత నియంత్రణ, పారదర్శకత, పటిష్టత నెలకొల్పడానికి చొరవలు జరుగుతున్నాయి. ఇక అందరికీ బ్యాంకింగ్ సేవల విస్తరణకు జన్ ధన్ యోజన పథకాల వంటి చర్యల విజయవంతానికి ప్రయత్నాలు మరోవైపు కొనసాగుతున్నాయి. వీట న్నింటినీ చూస్తే... మదుపరుల పెట్టుబడులకు బ్యాంకింగ్ ’రహదారి’గానే కనిపిస్తోంది.
మదుపరులకు బ్యాం‘కింగే’
Published Sun, Sep 7 2014 12:24 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement