jan dhan yojana
-
క్రియాశీలకంగా లేని జన్‌ధన్ ఖాతాల్లో వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై)కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో 54.03 కోట్ల ఖాతాలు తెరవగా ఇందులో సుమారు 11.30 కోట్ల ఖాతాలు క్రియాశీలకంగా లేవని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. లావాదేవీలు నెరపని ఈ అకౌంట్లలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీ నాటికి రూ.14,750 కోట్ల బ్యాలెన్సు ఉందని వివరించారు. 2017లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 39.62% వరకు ఉన్న జన్ ధన్ ఖాతాల సంఖ్య 2024 నవంబర్‌కు 20.91%కి పడిపోయాయన్నారు.రెండేళ్లపాటు ఎటువంటి లావాదేవీలు జరగని సేవింగ్/కరెంట్ ఖాతాలను ఆర్బీఐ క్రియాశీలకం కాని ఖాతాగా పరిగణిస్తుందన్నారు. ఖాతాలను క్రియాశీలకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. క్రియాశీలకం కాని ఖాతాల సంఖ్యను తగ్గించుకోవాలని బ్యాంకులను కోరామన్నారు. ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌గ్రేడేషన్, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ వంటి వాటితో అకౌంట్లను క్రియాశీలకం చేయాలని సూచిస్తున్నామన్నారు.పీఎం–కిసాన్తో 2 కోట్ల ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) ద్వారా దేశవ్యాప్తంగా 2.04 కోట్ల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూరుతోందని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇటీవలి 18వ ఇన్స్టాల్మెంట్లో 9.58 కోట్ల మంది లబ్ధిదారులు కాగా, వీరిలో 1.16 కోట్ల మంది ఎస్సీ రైతులు, 88.34 లక్షల మంది ఎస్టీ రైతులు, ఇతర కేటగిరీలో 7.54 కోట్ల మంది రైతులు ఉన్నారని వివరించారు. పథకం కింద ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోందంటూ ఆయన ఈ మొత్తాన్ని పెంచే యోచన లేదని వివరించారు.‘పీఎం విశ్వ కర్మ’ కింద రూ.1,751 కోట్ల రుణాలు పీఎం విశ్వకర్మ పథకం కింద అక్టోబర్ 31వ తేదీ నాటికి రూ.1,751 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలిపారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి వృత్తులకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణులు, పనివారికి సులభంగా రుణాలు అందేలా పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పథకం కింద ఈ వర్గం వారు మొత్తం 2.02 లక్షల బ్యాంకు అకౌంట్లు తెరిచారని చెప్పారు. 2023–24 నుంచి 2027–28 కాలానికి గాను కేంద్రం వీరికి ఈ పథకం కింద చేయూతనిచ్చేందుకు రూ.13 వేల కోట్లు కేటాయించింది. 18.74 కోట్ల రైతులకు పంట రుణాలు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 18.74 కోట్ల మంది రైతులు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. ఇందులో మొదటిస్థానంలో తమిళనాడు నిలిచిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలతో బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు. చదవండి: ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదంతమిళనాడులో అత్యధికంగా 2.88 కోట్ల మంది రైతులు పొందగా, తర్వాతి స్థానంలో యూపీలోని 1.88 కోట్ల మంది, కర్ణాటకలో 1.62 కోట్ల మంది రుణాలు పొందారని తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో కేంద్రం ఎటువంటి పంట రుణాలను మాఫీ చేయలేదని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతుల రుణాలను రద్దు చేశాయని మంత్రి పేర్కొన్నారు. -
ఖాతాలు ఇచ్చిన ధీమా
ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2014 ఆగస్ట్ 15న ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథక ప్రకటన చేశారు. ఈ పథకానికి ఇప్పుడు పదో వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయిన కోట్లాది మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే ప్రతిష్ఠాత్మక, సవాలుతో కూడిన చర్యను అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అందులో అది అద్భుతమైన విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్ ధన్ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.అధికారం, హోదా, పలుకుబడి లేదా భౌతిక సంపద – ఏదైనా సరే, మనం వాటిని ఆశించి, సాధించే దిశగా బలంగా కృషి చేస్తే మన విజయంతో మనమే సంతోషిస్తాం. కానీ ఆ విజయానందం కొద్దికాలమే నిలుస్తుంది. తర్వాత మన మనసు మరోదానికి మారుతుంది. సాధించినది అప్పటికి ఒక ప్రమాణంగా మారిపోతుంది. ఇంకా అంతుచిక్కకుండా ఉన్నది మరో అన్వేషణకో లేదా అశాంతికో కారణం అవుతుంది. ఇది చాలామంది మనుషులకు వర్తిస్తుంది. ప్రజా విధానాల విషయంలోనూ ఇదే విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. నిర్దిష్ట విధానాలు లేదా చర్యలు తీసుకోవాలని మనం గళమెత్తుతున్నాం. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తే, ఇక ప్రమాణాల స్థాయి మరింతగా పెరుగుతుంది. దాంతో సాధించిన విజయానికి తగిన గుర్తింపు లేకపోవడమేగాక, వ్యతిరేక భావనతో దిగువ స్థాయిలో యథాతథ స్థితి కొనసాగుతోంది. పదో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) అలాంటి అంశాల్లో ఒకటి.కోట్లాది మంది భారతీయులు ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండటం మీద చాలాకాలం మనం విచారం ప్రకటించాం. అందుకే వారిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే ప్రతిష్ఠాత్మక, సవాలుతో కూడిన చర్యను 2014లో అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అందులో అది అద్భుత విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్ ధన్ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.ముందుకు జరిగిన అభివృద్ధి‘‘2008లో ఆర్థిక సమ్మిళిత్వం, అధికారిక గుర్తింపు రెండూ తక్కువ స్థాయిలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఓ దశాబ్దం క్రితం భారత్ అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. బ్యాంకు ఖాతాల గణాంకాలు, తలసరి జీడీపీతో సంబంధాల ఆధారంగా – భారత్ పూర్తి సాంప్రదాయక వృద్ధి ప్రక్రియలపైనే ఆధారపడి ఉంటే 80 శాతం మంది వయోజనులు బ్యాంకు ఖాతా సాధించడానికి 47 సంవ త్సరాలు పట్టేదన్నది ఒక స్థూల అంచనా’’ అని ‘బ్యాంక్ ఫర్ ఇంట ర్నేషనల్ సెటిల్మెంట్స్’ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ‘డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాల రూపకల్పన: భారత్ నుంచి పాఠాలు’ (బీఐఎస్ పేపర్స్ నం.106, డిసెంబర్ 2019) శీర్షికతో ఉన్న ఒక పరిశోధనా పత్రం వెలువరించారు. ‘బ్యాంకింగ్‌లో లేనివారిని బ్యాంకులతో అనుసంధానించడం: 280 మిలియన్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఆర్థిక ప్రాప్యత గురించి ఏం చెప్తున్నాయి?’ పేరుతో సెప్టెంబర్ 2023లో మరో పరిశోధనా పత్రం వెలువడింది. దొంగతనాల ముప్పు ఉన్న ప్రాంతాల్లో జన్ దన్ యోజన ఖాతాల వినియోగం ఎక్కువగా ఉండడంతో, వారికి సంపా దనను కాపాడుకోవడంలో అవి దోహదపడ్డాయని ఈ పరిశోధన వెల్లడిస్తోంది. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు వసూలు చేసే అనధికారిక వనరుల నుంచి రుణాలు తీసుకోవడాన్ని కూడా ఇది తగ్గించింది.కానీ ఇది తక్షణ తీర్పులిచ్చే లోకం. మినహాయింపుల స్థాయిని దాటి ఆ తీరే ఒక ప్రామాణికంగా మారింది. పీఎంజేడీవై ఖాతాలు ఎక్కువగా ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాలేనంటూ కొందరు విమర్శకులు ఎత్తి చూపారు. వాస్తవం ఏమిటంటే, ఈ ఖాతాలన్నింటిలో మొత్తం రూ.2.31 లక్షల కోట్లు జమ అయ్యాయి. ఈ ఖాతాల వల్ల ఉప యోగం ఎంత అమూల్యమైనదో కోవిడ్ విపత్తు సమయంలో రుజువైంది. ప్రయోజనాలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఖాతాలకు బదిలీ చేసింది. మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2020 నుంచి 2022 వరకు), దాదాపు 8.1 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల పరిణామం వల్ల కోవిడ్ విపత్తు కీలక సమయంలో నగదురహిత చెల్లింపులను ఇది సులభతరం చేసింది.సార్వత్రిక బ్యాంకింగ్‌ను సాధ్యం చేయడంతోపాటు, వినియో గదారు అనుమతితో ఆర్థిక సంస్థకు సమాచార బదిలీలను పీఎంజేడీవై సులభతరం చేసిందని తాజా పరిశోధన (‘రుణ ప్రాప్యతను సార్వత్రిక బ్యాంకింగ్ విస్తరిస్తుందా?’, ఆగస్టు 2024) వెల్లడిస్తోంది. మరీ ముఖ్యంగా పీఎంజేడీవై ఖాతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫిన్ టెక్ నేతృత్వంలో రుణ వృద్ధి పెరిగింది. చౌక, మెరుగైన ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ‘ఖాతా సంకలనం’ అన్నది సార్వత్రిక బ్యాంకింగ్ వ్యక్తీకరణ. ప్రజలు మరిన్ని ఆర్థిక ఉత్పత్తులు, సేవలు పొందడానికి ఇది వీలు కల్పిస్తుంది.మహిళలకు స్వావలంబనమహిళలకు సొంత ఖాతాలు, వాటిలో డబ్బులతో పీఎంజేడీవై వారికి సాధికారత కల్పించింది. ఈ ఆర్థిక స్వావలంబనను అంచనా వేయడం కష్టం. కానీ ఇది ముఖ్యమైనది. సాధారణంగా భారత మహిళలు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. క్రమంగా, అది కుటుంబాల ఆర్థిక భద్రతను, జాతీయ పొదుపు రేటును పెంచుతుంది. ఇంకా, అది దేశంలో మహిళా వ్యవస్థాపకతను పెంచుతుంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ద్వారా వెల్లువెత్తిన వ్యవస్థాపకతలో మహిళల భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియానూ; మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్టాండప్ ఇండియా పథకాన్నీ ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం ముద్ర యోజన కింద 68 శాతం రుణాలను మహిళా పారిశ్రామిక వేత్తలకు మంజూరు చేయడం జరిగింది. స్టాండప్ ఇండియా పథకం కింద 2024 మే నాటికి లబ్ధిదారుల్లో 77.7 శాతం మంది మహిళలు ఉన్నారు. 2024 జూలై 30 నాటికి, ‘ఉద్యమ్’, ‘యూఏపీ’ పథకాలలో నమోదైన దేశంలోని మహిళల యాజమాన్యంలోని ‘ఎంఎస్ఎంఈ’ల (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ)ల సంఖ్య 1.85 కోట్లకు పైగా ఉంది. పీఎంజేడీవై ఖాతాలు మహిళలను సాధికారులను చేసి, స్వయం ఉపాధి/వ్యవస్థాపకతల్లో ప్రవేశించేలా వారికి దోహదపడ్డా యన్న భావన గణనీయమైనది. ఇది అధికారిక పరిశోధనకు అర్హమైనది.ఇక వ్యతిరేక భావనల సవాళ్లనూ పరిశీలిద్దాం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఖాతాదారులకు లభించిన ప్రయోజనాల ఆధారాల నేపథ్యంలో వాటిని పరిశీలించడం అంత కష్టమేం కాదు. పీఎంజేడీవైని ప్రారంభించడంపై దూరదృష్టితో నిర్ణయం తీసుకుని, తక్కువ వ్యవధిలో దానిని విజయవంతంగా అమలు చేయలేకపోతే గనక గత దశాబ్దపు అభివృద్ధిలో భారత్ సాధించిన విజయాలు గణనీ యంగా తక్కువగా ఉండేవి.వి. అనంత నాగేశ్వరన్ వ్యాసకర్త ఆర్థికవేత్త;భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు -
కొత్తగా ఖాతాలు తెరిచిన 30 కోట్ల కుటుంబాలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరంభించిన జన్‌ధన్ యోజన స్కీమ్ విజయవంతం అయినట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మూడేళ్లలో ఈ స్కీమ్ కింద 30 కోట్ల కుటుంబాలు కొత్తగా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాయని ఆయన బుధవారం ప్రకటించారు. జన్‌ధన్‌యోజన కార్యక్రమం ఆరంభించకముందు.. దేశంలో దాదాపు 42 శాతం కుటుంబాలు బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో 99.99 శాతం కుటుంబాలు ఒదోఒక బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. -
‘జన్ ధన్’ పైసా వసూల్ చేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘జన్ ధన్ యోజన’ పథకం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకున్నారు. ముమ్మాటికి ఆ మాట నిజమంటూ ఆయన మంత్రివర్గ సహచరులు ఆయనకు వంత పాడారు. ఈ పథకాన్ని ప్రారంభించి ఆగస్టు 27వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మంత్రివర్గం ఈ మేరకు ప్రకటనలను గుప్పించింది. ఈ పథకం ద్వారా 29.51 కోట్ల మంది ప్రజలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిపించామని, తద్వారా 99.99 శాతం ఇళ్లవారిని బ్యాంకుల లావాదేవీల పరిధిలోకి తీసుకొచ్చామని వారు గర్వంగా చెప్పుకున్నారు. వారి మాటల్లో ఎంత వరకు నిజముంది? కొత్తగా ఖాతాలు తెరవడం వల్లన వారికి కలిగిన ప్రయోజనం ఏమిటీ? అసలు ఏ లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు, లక్ష్యాల్లో ఏ మేరకు విజయం సాధించారు? జన్ ధన్ యోజన కింద ఖాతాలు తెరచిన వారికి ‘ఓవర్ డ్రాప్ట్’ తీసుకోవచ్చని, బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని, ఏటీఎం సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చని, భీమా సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం ఆశ చూపించింది. ఖాతాలను తెరచేందుకు కనీస డిపాటిట్ నిబంధన కూడా లేకుండా జీరో బ్యాలెన్స్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన పెద్దగా రాకపోవడంతో దేశం నుంచి తరలిపోతున్న నల్లడబ్బును తీసుకొచ్చి తలా 15 లక్షల రూపాయల చొప్పున జన్ ధన్ యోజన ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రజల నుంచి కాస్త స్పందన పెరిగింది. 15 లక్షల రూపాయలు జీవిత కాలంలో వచ్చే అవకాశం ఎవరికీ లేకపోయినప్పటికీ ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయన్న అంశాన్ని మాత్రం బేరీజు వేయాల్సి ఉంది. ఈ పథకం కారణంగా నేడు 99.99 శాతం ఇళ్లవారిని బ్యాంకుల లావాదేవీల పరిధిలోకి తీసుకొచ్చామని ప్రభుత్వం ప్రకటిం^è గా, 90 శాతం ఇళ్లవారిని మాత్రమే తీసుకరాగలిగిందని ‘మాన్యుల క్రిస్టిన్ గుంతర్’ అనే అంతర్జాతీయ సంస్థ ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. ఓ ఇంటిలో ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉన్న ఆ ఇల్లు బ్యాంకు లావాదేవీల పరిధిలోకి వచ్చినట్లే. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జన్ ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన దాదాపు 30 కోట్ల మందిలో 79 శాతం మందికి అందరిలాగే అంతకుముందే రెగ్యులర్ ఖాతాలు ఉన్నాయట. 21 శాతం మంది మాత్రమే కొత్తగా బ్యాంకింగ్ పరిధిలోకి ఈ పథకం కింద వచ్చారన్న మాట. ఈ బ్యాంకు ఖాతాల వల్ల ఓవర్‌డ్రాప్ట్ ప్రయోజనం కలగడం మరో ముఖ్యమైన ఆకర్షణ. అయితే 2016, డిసెంబర్ నెల వరకు ఐదు వేల రూపాయల ఓవర్ డ్రాప్ట్‌లను కేవలం 44.28 లక్షల మందికి మాత్రమే మంజూరు చేశారు. వారిలో కూడా సగం మంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఖాతాదారులందరికి ‘రూపే కార్డు’ ఇచ్చామన్నది ప్రభుత్వం చెప్పుకుంటున్న మరో విజయం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇలాంటి కార్డులకు డిమాండ్ పెరిగినప్పటికీ గత ఆగస్టు 16వ తేదీ వరకు 76 శాతం ఖాతాదారులకు మాత్రమే రూపే కార్డులు మంజూరు చేయగలిగింది. వీటిలో కూడా ప్రతి ఐదుగురు ఖాతాదారుల్లో ఒకరు కార్డును అసలే ఉపయోగించడం లేదని రూపే చెల్పింపులను నిర్వహిస్తున్న భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ మాజీ చీఫ్ ఏపీ హోతా వెల్లడించారు. 2014, ఆగస్టు నుంచి 2015, మార్చి లోపల జన్ ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి 30 వేల రూపాయల జీవిత బీమాను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం ఈ పథకం వల్ల కలిగే మరో ప్రయోజనం. ఈ నిర్దేశించిన కాలంలో 14.71 కోట్ల మంది ఖాతాలు తెరిచారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2016, డిసెంబర్ 23వ తేదీ వరకు 3,936 క్లెయిమ్‌లు రాగా, వాటిలో 3,421 మంది క్లెయిమ్‌లను కేంద్రం క్లియర్ చేసింది. మిగతా క్లెయిమ్‌లను తిరస్కరించింది. మొత్తం జీవిత భీమా అర్హుల్లో 0.002 శాతం మందికి మాత్రమే బీమాను చెల్లించింది. ఈ పథకం కింద బ్యాంకు ఖాతాలను తెరచి ఆరు నెలల వరకు కూడా వాటి లావాదేవీలు అసలే ప్రారంభం కాలేదని, ఆ తర్వాత లావాదేవీలు ప్రారంభం అయినప్పటికీ మందకొడిగానే సాగుతున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గత మే నెలలో జరిపిన అధ్యయనంలో తేలింది. ఇంటికి ఒక్క ఖాతా ఉన్నట్లయితే కనీసం ఇంట్లోని ఇద్దరు, ముగ్గురైన ఉమ్మడిగా ఆ ఖాతాను ఉపయోగిస్తారని ప్రభుత్వం ఆశించింది. అది అడియాశేనని మరో అధ్యయనంలో తేలింది. అలా ఒక్క ఖాతను ఉమ్మడి ఖాతాగా ఉపయోగించే వారు జన్ ధన్ యోజన ఖాతాదారుల్లో రెండు శాతానికి మించి లేరని తేల్చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల డబ్బు వచ్చి ఈ ఖాతాలకు చేరడం వల్లనే అంతో ఇంతో ఈ ఖాతాల లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారమే పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ఖాతాల్లో 59,810 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా 49వేల రూపాయలకు లోపున డిపాజిట్ అవడం వల్ల వాటిని విత్‌డ్రా చేసుకోనీయకుండా కూడా ప్రభుత్వ అడ్డుపడలేక పోయింది. ఏదేమైనప్పటికీ భారతీయులందరిని బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చి వారి నుంచి ‘పైసా వసూల్’ చేయాలన్న ప్రభుత్వం అంతిమ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. -
‘జన ధన’కు కాసుల కళ..
♦ తగ్గుతున్న జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ♦ దేశవ్యాప్తంగా దాదాపు రూ. 40 వేల కోట్ల డిపాజిట్లు ♦ తెలుగు రాష్ట్రాల్లో డిపాజిట్లు రూ. 1,916 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రధానమంత్రి జన ధన యోజన (జేడీవై) క్రమంగా ఆదరణ చూరగొంటోంది. దీంతో జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గతేడాది జనవరిలో 67 శాతంగాను, ఆగస్టులో దాదాపు 45 శాతంగానూ ఉన్న ఈ తరహా ఖాతాల సంఖ్య ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి సుమారు సగం తగ్గి.. 25.29 శాతం స్థాయికి చేరింది. గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 22.37 కోట్ల ఖాతాలు ప్రారంభించగా .. వీటిలో రూ. 39,939 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాలెన్స్ విషయంలో రూ. 31,409 కోట్లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందు ఉండగా, ప్రైవేట్ బ్యాంకుల్లో 1,498 కోట్లు ఉన్నాయి. మిగతా రూ. 7,000 కోట్ల వాటా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులదిగా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమయ్యేందుకు ఆసక్తి కనపరుస్తున్నరనడానికి నిదర్శనంగా.. సదరు ఖాతాల్లో డిపాజిట్ల పరిమాణం సైతం పెరుగుతోంది. 2014 ఆఖర్లో సుమారు రూ. 795గా ఉన్న సగటు డిపాజిట్ పరిమాణం ఈ ఏడాది మే నాటికి 118 శాతం పెరిగి రూ. 1,735కి చేరింది. మారుమూల ప్రాంతాల్లో పేదవారు కూడా బ్యాంకుల మాధ్యమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2014 ఆగస్టులో జన ధన యోజన పథకం ప్రారంభమైంది. మినిమం బ్యాలెన్స్‌ల బాదరబందీ లేకుండా ఉచితంగానే ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన వారికి లావాదేవీల నిర్వహణను బట్టి దాదాపు రూ. 5 వేల దాకా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, బీమా కవరేజీ మొదలైనవి కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. అయితే, జేడీవై ఖాతాల ద్వారా వేల కోట్లు వచ్చినప్పటికీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కల్పించే విషయంలో బ్యాంకులు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి జేడీవై ఖాతాదారులు దాదాపు రూ. 272 కోట్ల ఓడీ మొత్తాన్ని పొందారు. తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల ఖాతాలు .. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇప్పటిదాకా తెలంగాణలో మొత్తం 79,85,430, ఆంధ్రప్రదేశ్‌లో 74,96,066 అకౌంట్లు ఉన్నాయి. తెలంగాణ ఖాతాల్లో రూ. 959 కోట్లు, ఏపీ ఖాతాల్లో రూ. 957 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. దేశం మొత్తం మీద జీరో బ్యాలెన్స్ ఖాతాలు సగటున 25 శాతంగా ఉండగా.. తెలంగాణలో 31 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 24 శాతం స్థాయిలో ఉన్నాయి. జన ధన ఖాతాల ప్రయోజనాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుతుండటం ఈ అకౌంట్లలో బ్యాలెన్స్‌లు మెరుగుపడుతుండటానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) చైర్మన్ వి. నరసి రెడ్డి తెలిపారు. అలాగే, ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా వివిధ సబ్సిడీల మొత్తాలను జన ధన ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చే స్తుండటం కూడా మరో కారణమని ఆయన వివరించారు. -
మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే: మోదీ
రహా(అసోం): కాంగ్రెస్ హాయాంలో కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదా చిట్ ఫండ్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. తాము జన ధన్ యోజన పథకం ప్రారంభించడంతో భవిష్యత్ లో చిట్ ఫంఢ్ మోసాలు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరవడంతో ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటున్నారని, చిట్ ఫండ్స్ అవసరం వారికి లేదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. 'ఏం చేశామనేది మనం చేసిన పనే చెబుతుంది. కాంగ్రెస్ హాయాంలో జరిగిన పనుల గురించే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం. మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే' అంటూ చురక అందించారు. త్రీడీ ఎజెండాతో అభివృద్ధి సాధిస్తామని మోదీ అన్నారు. అభివృద్ధి(డెవలప్ మెంట్), వేగంగా అభివృద్ధి(స్పీడీ డెవలప్ మెంట్), అన్నివిధాలా అభివృద్ధి(ఆల్ రౌండ్ డెవలప్ మెంట్) ఎజెండాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. -
జన్‌ధన్‌లో డూప్లికేషన్లు: సర్వే
న్యూఢిల్లీ: జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద అకౌంట్ల డూప్లికేషన్ భారీగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. 28%కిపైగా అకౌంట్లు క్రియారహితంగా ఉన్నట్లు కూడా ఈ సర్వే తేల్చింది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు సంబంధించి మైక్రోసేవ్ అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన సర్వే ఈ అంశాలను వివరించింది. సర్వేకి సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... * 17 రాష్ట్రాల్లోని 42 జిల్లాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సర్వే జరిగింది. దాదాపు 6,000 మంది అభిప్రాయాలను ఈ సర్వే తీసుకుంది. * ఈ అకౌంట్లు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు, సబ్సిడీలు అందిస్తాయని, దీనివల్ల బహుళ లాభాలు ఉంటాయని పలువురు భావించడం ఈ అకౌంట్ల పెరుగుదలకు ఒక కారణం. * పీఎంజేడీవై మాత్రమే తమ మొట్టమొదటి అకౌంట్ కాదని 33% మంది కస్టమర్లు తెలిపారు. * అప్పటికే ఒక అకౌంట్ ఉండీ, పీఎంజేడీవై అకౌంట్ తెరిచిన వారు, తమ తొలి అకౌంట్‌నే ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. -
మోదీ జన్ధన్యోజనకు గిన్నిస్ రికార్డు
-
గిన్నీస్ రికార్డుకెక్కిన జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలు గిన్నీస్ రికార్డుకెక్కాయి. ఒక్క వారంలో కోటి 80 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచినందుకు గిన్నీస్ రికార్డులలో నమోదు కానుంది. భారత్‌లో ఆగస్ట్ 23 - 29 మధ్య కాలంలో కోటి 80 లక్షల 96వేల 130 ఖాతాలు ప్రారంభించారు. -
ఫోర్త్ ఎస్టేట్ : జన్ ధన్ యోజన
-
పేదల నిజాయితీకి మోదీ సలాం!
-
పేదల నిజాయితీకి మోదీ సలాం!
భారతదేశంలో నిరుపేదల నీతి, నిజాయితీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలాం కొట్టారు. ప్రధానమంత్రి జనధన యోజన కింద పేదలతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన విషయాన్ని సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరెనాలో వేలాది సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులకు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో నిరుపేదల నిజాయితీ గురించి చెబుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. జనధన యోజన కింద ఒక్క రూపాయి కూడా వేయక్కర్లేకుండానే ఖాతాలను ప్రారంభించుకోవచ్చని తాము తెలిపామని, కానీ మోదీ చెబితే చెప్పారు.. మనం నిజాయితీగా ఉండాలనే వాళ్లు భావించారని అన్నారు. అందుకే ఒక్కొక్కళ్లు 100, 200 రూపాయల చొప్పున ఆ ఖాతాల్లో జమచేసి మొత్తం 5 వేల కోట్ల రూపాయలతో ఖాతాలను తెరిచారన్నారు. ఈ విషయం ఆయన చెప్పగానే.. ఒక్కసారిగా ప్రేక్షకులంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో అభినందించారు. -
జన ధన ఖాతాలకు 3 వారాల్లోగా రుపే కార్డ్‌ల జారీ
ముంబై: జన ధన పథకంకింద బ్యాంకులు గత వారం చివరికి 4 కోట్ల ఖాతాలను తెరిచినప్పటికీ రుపే కార్డ్‌ల జారీ ఆలస్యమవుతోంది. ఒక్కసారిగా కోట్లకొద్దీ ఖాతా లు ఓపెన్ కావడంతో కార్డ్‌ల జారీకి సమయం పడుతుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఎండీ ఏపీ హొటా చెప్పారు. జన ధన పథకం ద్వారా ప్రారంభమైన కొత్త ఖాతాలకు ఏటీఎం కార్డ్‌లను ఎన్పీసీఐ జారీ చేస్తోంది. ఇప్పటి వరకూ 20 లక్షల రుపే కార్డ్‌లను జారీ చేసినట్లు హొటా చెప్పారు. అయితే ఒక్కసారిగా ఇన్ని ఖాతాలను ఎవరూ అంచనా వేయలేదని, మూడు వారాల్లోగా కార్డ్‌ల జారీని పూర్తి చే సే అవకాశమున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఆగస్ట్ 28న జన ధన పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే. పథకంలో భాగంగా ఖాతాదారులకు రూ. 5,000 వరకూ రుణ సదుపాయం(ఓవర్‌డ్రాఫ్ట్), రుపే డెబిట్ కార్డ్, రూ. లక్ష విలువచేసే బీమా రక్షణ లభిస్తాయి. -
బ్యాంకు ఖాతాకు సిమ్ కార్డు ఫ్రీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన జనధన యోజన పేదలకు పలురకాలుగా ఉపయోగపడుతోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ సంస్థ కూడా ఈ పథకానికి తమవంతు సాయం అందించడం మొదలుపెట్టింది. ప్రజలకు ఇదో డబుల్ ధమాకా. జనధన యోజన కింద బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా సిమ్ కార్డులు రాబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ జీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిస్తే ఉచితంగా జీవితబీమా సదుపాయం కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సిమ్ కార్డు సదుపాయం అదనం అన్నమాట. -
పథకంతో ‘జన’ యోజనే ప్రశ్నార్థకం?
జనవరి 26, 2015 నాటికి 7.5 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల సదుపాయం...కుటుంబానికి రెండు ఖాతాలు చొప్పున మొత్తం 15 కోట్ల ఖాతాలు... వీటితోపాటు రూపే డెబిట్ కార్డుల జారీ ...దీని ఆధారంగా లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం ....ఇదీ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం స్వరూపం. దేశాన్ని నెమ్మిదిగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశలో నడపాలన్న దీర్ఘకాలిక లక్ష్యం ఈ పథకం వెనకున్న ఉద్దేశం. సంక్షేమ పథకాలంటూ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా లబ్ధిదారులకు మాత్రం శతశాతం చేరడం లేదు. ఈ దుస్థితిని అధిగమించి ఆర్థిక స్వావలంబన దిశగా ఈ పథకం రూపుదిద్దుకుంది. అయితే క్షేత్రస్థాయిలో కొరకరాని కొయ్యలా ఉన్న కొన్ని సమస్యలను చిత్తశుద్ధి, కార్యాచరణతో పరిష్కరిస్తే లక్ష్యసాధన కష్టమేమీ కాదన్నది వాస్తవం. ఆ దిశగా మోడీ ప్రభుత్వం ఏమేర సఫలీకృతమవుతుందో మరి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన - స్వరూపం స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘ప్రధానమంత్రి జన్ ధన్యోజన’అనే ఆర్థిక సంఘటిత పథకాన్ని ప్రకటించారు.ప్రకటించిన రెండు వారాల్లోపే కార్యాచరణకు ఉపక్రమిస్తూ ఆగస్టు 28న న్యూఢిల్లీలో పథకాన్ని ప్రారంభించారు. పథకం పురుడు పోసుకున్న తొలిరోజే రికార్డు స్థాయిలో 1.5 కోట్ల ఖాతాలు తెరిచారు. పథకం ముఖ్యాంశాలు 1. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేని 7.5 కోట్ల కుటుంబాలకు ఖాతాలు తెరవడం. 2. రూపె డెబిట్ కార్డు జారీ, 3. రూ. 5000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ (బదిలీ సౌకర్యం) 4. రూ. లక్ష రూపాయల ప్రమాద బీమా, రూ. 30 వేల రూపాయల జీవిత బీమా అనూహ్య స్పందన ఖాతాలను తెరవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఇంతటి అనూహ్య స్పందనకు కారణాలూ ఉన్నాయి. ప్రభుత్వం అందించే రాయితీ పథకాలన్నీ బ్యాంక్ ఖాతాల ద్వారానే లభిస్తాయి. ఖాతాను తెరవడానికి పైసా పెట్టుబడి అవసరం లేదు. ఖాతాలలోకి ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. వాస్తవానికి ఈ ఖాతాలు తెరవడం ద్వారా జీవితబీమా సౌకర్యం మాత్రమే లభిస్తుంది. పథకం వెనక ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా నగదు చలామణీ అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీని వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. నోట్ల ముద్రణ, భద్రత లాంటి సమస్యలకు తోడు సమాజంలో ఎన్నో రుగ్మతలకు అధిక నోట్ల చలామణీ కారణమవుతోంది. నగదు చలామణీ తగ్గించి అన్ని లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారానే పారదర్శకంగా నిర్వహించాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతం కావాలి. దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు ఖాతా ఉండటమే దీనికి సరైన మందు. సగం మందికి ఖాతాల్లేవు ప్రస్తుతం దేశంలో 58.7 శాతం కుటుంబాలు మాత్రమే బ్యాంకింగ్ సౌకర్యాలు పొందుతున్నాయి. జన్‌ధన్ యోజన పథకం ద్వారా మిగతా 41 శాతం మందికి ఆర్థికంగా సంఘటితం చేయాలని. 2013లో రిజర్వ్‌బ్యాంక్ నియమించిన నచికేత్ మోర్ కమిటీ ఈ మేరకు సూచనలు చేసింది. అంతకుముందు 2008లో నియమించిన రంగరాజన్ కమిటీ నివేదిక ఆర్థిక సంఘటిత ఆవశ్యకతను ప్రస్తావించింది. ఈ కమిటీ సేకరించిన గణాంకాల ప్రకారం 256 జిల్లాలలో 95 శాతం వయోజనులకు బ్యాంక్ ఖాతా సౌకర్యం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ఆర్థిక సంఘటితంలో రెండు ప్రధానాంశాలున్నాయి. 1. బ్యాంకు ఖాతాలు 2. పరపతి సౌకర్యం ఇందులో మొదటి అంశం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకానికి ఉద్దేశించింది. రెండో అంశం ఏమేరకు ఈ పథకం ఆచరణాత్మకమవుతుందనేదే ప్రశ్నార్థకం. దీనికితోడు బ్యాంకు ఖాతా తెరిచిన వారందరికీ జీవిత బీమా సౌకర్యం లభించదు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రెండు నుంచి మూడు కోట్ల ఖాతాదారులకు మాత్రమే బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఎందుకంటే 18 - 59 ఏళ్ల వారికే జీవిత బీమా లభిస్తుంది. జీవిత బీమా కేవలం ఆధార్ సంఖ్యకు అనుసంధానమైతేనే ప్రయోజనం కలుగుతుంది. ఈ రెండు షరతులతో నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ఖాతాదారులకు జీవిత బీమా సౌకర్యం వర్తించదు. సక్రమ అమలుకు సందేహాలెన్నో బ్యాంకు ఖాతాలన్నింటిలో క్రమబద్ధంగా లావాదేవీలు జరుగుతున్నాయా? ఖాతాదారులకు కల్పించే రుణ సౌకర్యానికి డబ్బు ఎలా వస్తుంది? జీవిత బీమా పథకాన్ని ఖాతాదారులందరికీ ఎలా వర్తింపజేయాలి? ఖాతాలు తెరవడానికి, వాటి నిర్వహణకు అయ్యే అదనపు వ్యయాన్ని బ్యాంకులు భరించే స్థితిలో ఉన్నాయా? ఈ అదనపు భారాన్ని కేంద్రం భరిస్తుంది. కానీ దాని ప్రభావం మిగిలిన సంక్షేమ పథకాల మీద పడుతుందా? పథకం మంచిదే జన్‌ధన్‌యోజన అమలుతో బ్యాంకులపై ఆర్థిక భారం పడదని ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఎందుకంటే ఖాతాల ద్వారా బ్యాంకులకు కరెంట్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్ల రూపంలో తగినన్ని వనరులు సమకూరుతాయి. పథకం అమలుతో కల్పించే మౌలిక సదుపాయాల వలన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో నగదు జమ అవుతుంది. దీంతో సర్కారు అందించే ఆర్థిక సాయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. రూపె డెబిట్‌కార్డు ద్వారా లావాదేవీలతో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ూ్చ్టజీౌ్చ ్క్చడఝ్ఛ్టట ఇౌటఞౌట్చ్టజీౌ ైజ ఐఛీజ్చీ)కు కొంత ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని ప్రమాదబీమా పథకం అమలుకు వినియోగించవచ్చు. రూపె డెబిట్ కార్డులు విస్తృతంగా వాడుకలోకి వచ్చి వాటిని అన్ని బ్యాంకుల అఖీకలలో, దుకాణాలలో వాడటానికి వీలైతే ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు బ్యాంక్ కరస్పాండెంట్లపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. విస్తృత వాడకం వల్ల వినియోగ ఫీజు తగ్గుతుంది. బహుళ జాతిసంస్థలు జారీచేసే వీసా, మాస్టర్ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోతుంది. వీటిని వాడటం వల్ల దేశీయంగా ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయవచ్చు. అంతర్జాతీయ కార్డుల వాడకం మన ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తాయి. కనీసం ఆరునెలలపాటు ఖాతాను విజయవంతంగా నిర్వహించిన వారికే రుణ సౌకర్య ఖాతా అందుతుంది. ఇది బ్యాంకుల మీద ఎలాంటి భారం మోపదు. బీమా పథకం బ్యాంకులు ఇచ్చిన రుణాలకు హామీని ఇస్తుంది. సమస్యలూ ఉన్నాయ్ 1. ఈ పథకం విజయ వంతం కావాలంటే బ్యాంకింగ్ కరస్పాండెంట్ పాత్ర ఎంతో కీలకం. ఖాతాదారునికి, బ్యాంకుకు అనుసంధానకర్తగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సమర్థత కనబరచాలి. అప్పుడే బ్యాంకు ఖాతాలలో క్రమంగా లావాదేవీలు జరుగుతాయి. ఇందుకోసం 2 లక్షల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కావాలి. ఇప్పటికి 2,48,000 మంది పనిచేస్తున్నారు. అదనంగా మరో 50,000 మందిని నియమించాలనేది ప్రభుత్వ యోచన. అయితే... ఇప్పుడున్న కరస్పాండెంట్స్ సరిగా పనిచేయడం లేదు. దీనికి కారణం వారికిచ్చే అరకొర జీతాలే. అదనంగా కొంతమందిని నియమించి వారికి రూ. 5,000 జీతమివ్వాలంటే అది మరింత భారమవుతుంది. 2.ఒక్కో ఖాతాకు రూ. 5వేలు చొప్పున రుణ సౌకర్యం కల్పించడానికి రూ. 37,500 కోట్లు కావాలి. నాబార్డు రూ. వెయ్యి కోట్లకు మాత్రమే హామీ ఇచ్చింది. మరి మిగిలిన మొత్తాన్ని సర్కారు ఎలా సమకూరుస్తుంది? చివరికి ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారానికి దారి తీయవచ్చు. 3.ప్రభుత్వ బ్యాంకులలో నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ విపరీతంగా పెరిగాయి. వీటిని ముందు పరిష్కరించకపోతే గత పాలక ప్రభుత్వాలు అమలు చేసిన అరువు మేళా లాంటి పథకాల జాబితాలోకి జన్‌ధన్ యోజన కూడా చేరుతుందనే సందేహాలు లేకపోలేదు. 4.పథకం అమలుకు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేదు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉపయోగించే యంత్రాలు (మొబైల్స్, ప్రింటర్స్) తరచూ మొరా యించడం, వాటి ఛార్జింగ్‌కు గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లేకపోవడం అతిపెద్ద ప్రతిబంధకాలు. 5.గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు ఖాతా తెరవాలంటే వారం, పదిరోజులు పడుతుంది. రుణాలు మంజూరైనప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో ఎనలేని జాప్యం జరుగుతోంది. బ్యాంకుల జాతీయీకరణ 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసింది. 1980లో మరికొన్నింటిని జాతీయం చేశారు. అప్పుడు ఈ చర్యను చాలా మంది విమర్శించారు. కానీ బ్యాంకుల జాతీయీకరణ నేడు సగటు పౌరునికి ఎంత గానో ఉపయోగపడుతుంది. 1968-69లో 12 శాతంగా ఉన్న సగటు పౌరుని పొదుపు రేటు 1979-80 నాటికి 20 శాతానికి పెరిగింది. పెట్టుబడుల శాతం 13 నుంచి 21 శాతానికి చేరింది. 1970లో కేవలం 3.5 శాతానికి పరిమితమైన పెరుగుదల 1980 నాటికి 5.5 శాతం నమోదైంది. బ్యాంకుల జాతీయీకరణ అనే ఆర్థిక సంఘటితం ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను పటిష్ట పరిచింది. ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కూడా అలాంటిదే. పథకం పటిష్టత కోసం ఠి బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రాంతాలలో చౌకధరల దుకాణాలను వేదికగా చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలి. దేశ వ్యాప్తంగా 5 లక్షల చౌక ధరల దుకాణాలున్నాయి. వీటిని తాత్కాలిక బ్యాంకు కౌంటర్లుగా వినియోగించుకోవచ్చు. కరస్పాండెంట్లకు అధికార హోదాను కల్పిస్తే ప్రజలకు వారి మీద నమ్మకం కుదురుతుంది. వీరికి అదనపు ప్రోత్సాహకాలు కల్పించడం, పనితీరును బట్టి వారి పరిధిని పెంచాలి. బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో పోస్టాఫీసులు పొదుపు పథకాల ద్వారా ప్రజల సొమ్మును భద్రపరిచేవి. ప్రస్తుత గణాంకాల ప్రకారం పోస్టాఫీసులలో రూ. 6,03,170 కోట్లు తపాలా బ్యాంకింగ్ పథకం కింద ఉన్నాయి. ఆ మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులకు బదిలీ చేస్తే ఆర్థిక సంఘటిత పథకాన్ని విజయవంతంగా అమలు చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. నమ్మకం కలిగించాలి వాస్తవానికి మన్మోహన్సింగ్ ప్రభుత్వం 2013-14 లోనూ 6.1 కోట్ల ఖాతాలు తెరిచింది. కానీ దానివల్ల ఒరిగింది నామమాత్రం. బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమంటే కేవలం బ్యాంకు ఖాతా తెరిచి ఇవ్వడమే కాదు. దాని ద్వారా కొన్ని ప్రయోజనాలూ కల్పించాలి. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే దాన్ని అమలుచేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి, అంకితభావం అవసరం. వీటితోపాటు అమలును పర్యవేక్షించే సరైన రాజకీయ నాయకత్వంలో ధృడ సంకల్పం అవసరం. వీటన్నింటికీ మించి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కొంత మేర జనాదరణ చూరగొంది. తమకు మంచి జరుగుతుందనే బలమైన న మ్మకం ప్రజల్లో ఉంది. ఆ వైఖరే జన్ ధన్ యోజనకు శుభసూచకం. -
మదుపరులకు బ్యాం‘కింగే’
ఆర్థికాభివృద్ధికి సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మనం ఎంతో కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఈ దిశలో తీసుకునే చర్యల అమల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులదే కీలక పాత్ర. మొండి బకాయిల (ఎన్పీఏ)ల వంటి సమస్యలు ఉన్నప్పటికీ, వీటన్నింటినీ అధిగమించే సత్తా ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి ఉందని ఫండమెంటల్స్ పేర్కొంటున్నాయి. బాసెల్-3 ప్రమాణాలకు సిద్ధం భారత్ బ్యాంకులు అంతర్జాతీయ ప్రమాణాలు- బాసెల్ 3కి తగిన నిధుల సమీకరణకు సిద్ధంగా ఉన్నాయి. పబ్లిక్కు ఈక్విటీల జారీ, 51 శాతానికి తగ్గకుండా ప్రభుత్వ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ వంటి కీలక నిర్ణయాల దిశలో త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. రానున్న నాలుగేళ్లలో తాజా మూలధన సమీకరణ లక్ష్యాలను సాధించే వీలుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి హోల్డింగ్ కంపెనీ వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుత అంశానికి వస్తే, దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులూ నిర్దేశిత 9%కి పైగా మూలధనాన్ని కలిగి ఉన్నాయి. రుణ వృద్ధికి తద్వారా అధిక ఆర్థికాభివృద్ధి రేటును సాధించడానికి ఇది కలిసి వచ్చే అంశం. తగ్గుతున్న మొండిబకాయిలు బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం మొండి బకాయిలు (ఎన్పీఏ) ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. అయితే ఇటీవలి కాలంలో ఎన్పీఏల స్పీడ్ తగ్గడం హర్షణీయ పరి ణామం. అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీ) బ్యాంకుల మొండి బకాయిల అసెట్స్ విక్రయం ఇం దులో కీలక పాత్ర పోషిస్తోంది. బ్యాంకింగ్, ఏఆర్‌సీలు సంయుక్తంగా ఎన్పీఏల సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తున్నాయి. ఇక రుణాల రికవరీ దిశలో సర్ఫేసీ (ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ) చట్టం పటిష్టవంతానికి రిజర్వ్ బ్యాంక్ కసరత్తు ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులపై చర్యలు సైతం వేగవంతం అవుతున్నాయి. ప్రభుత్వం సైతం ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడులకు ‘రహదారి’! కుంభకోణాల కట్టడికిగాను బ్యాంకింగ్ ఉన్నత స్థాయిలో మరింత నియంత్రణ, పారదర్శకత, పటిష్టత నెలకొల్పడానికి చొరవలు జరుగుతున్నాయి. ఇక అందరికీ బ్యాంకింగ్ సేవల విస్తరణకు జన్ ధన్ యోజన పథకాల వంటి చర్యల విజయవంతానికి ప్రయత్నాలు మరోవైపు కొనసాగుతున్నాయి. వీట న్నింటినీ చూస్తే... మదుపరుల పెట్టుబడులకు బ్యాంకింగ్ ’రహదారి’గానే కనిపిస్తోంది. -
సామాన్యునికి పట్టంగట్టిన ప్రధాని
ప్రధాని జన ధన్ యోజన పథకానికి మూడు రోజుల్లోనే మూడు కోట్ల మంది స్పందించారంటే ప్రజలు ఎంతగా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అర్థం కావడం లేదా? సామాన్యుల ప్రయోజనాలే పరమ పవిత్ర కర్తవ్యంగా తలదాల్చిన ప్రధాని... అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేతనని ఈ వంద రోజుల్లో రుజువు చేశారు. ‘‘ఈ దేశానికో గమ్యం ఉంది. అది ప్రపంచ సంక్షేమం కోసం పని చేయడం. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట. ఆ గమ్య సాధన క్రమంలోనే హిందుస్థాన్ అవతరించింది. భారత్ ఆవిష్కృతమైంది’’ -ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ తొలి వంద రోజుల పాలన పూర్తయింది. ఈ స్వల్ప వ్యవధిలో ఆయన పని తీరును అంచనా వేయడం దుస్సాహసమే. అయితే ఆయన తన లక్ష్యంగా ప్రకటించిన నవ్య భారత్ దిశగానే కచ్చితంగా దేశాన్ని నడుపుతున్నారనేది ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ కొద్ది రోజుల్లో ఆయన చేపట్టిన చర్యలే అందుకు సాక్ష్యం. ఆర్థిక అస్పృశ్యత నివారణకు జరుగుతున్న బృహత్తర కృషిని, ఆర్థిక క్రమశిక్షణ సాధనలోని ప్రగతిని ఆయన విమర్శకులు సైతం గుర్తించక తప్పదు. అలసత్వానికీ, జాప్యానికీ మారుపేరుగా నిలిచిన అధికార యంత్రాంగాన్ని సున్నితమైన వ్యాఖ్యలతో దారిలోకి తెస్తున్నారు. దానికి జవాబుదారీతనం, పారదర్శకత అలవడేట్టు చేసి భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసే దిశగా దృఢసంకల్పంతో కూడిన కృషి మొదలైంది. మందకొడితనానికి స్వస్తి... ప్రపంచం కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో ఇరుగుపొరుగు దేశాలతో, ఇతర ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు చాలా ప్రాధ్యానం ఉంది. ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధిపతులను ఆహ్వానించడంతోనే ప్రధానిగా మోడీ తొలి రోజునే ఆ కృషికి శ్రీకారం చుట్టారు. బర్మా, బ్రెజిల్, నేపాల్ పర్యటనల నుండి నిన్నటి జపాన్ పర్యటన వరకు మోడీ సాధించిన వరుస దౌత్య విజయాలే వినూత్నమైన ఆయన విదేశాంగ విధాన సాఫల్యతకు తిరుగులేని సాక్ష్యం. ఒక్క పర్యటనతో జపాన్ నుండి రెండున్నర లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులనే గాక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సాధించడం అపూర్వం. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అనే తీరుగా సాగిన గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న విధానపరమైన స్తంభనతో అభివృద్ధి కుంటుపడింది. ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం, మంత్రుల కమిటీలు ఇలా పలు అంచెలలో ఒకరు అవునన్నది మరొకరు కాదంటుండగానే కాలం గడచిపోయేది. విధానపరమైన జాప్యం, అలసత్వం వ్యాపించిపోయాయి. చివరికది నిష్క్రియాపరత్వంగా దిగజారి ప్రజలకు చేరాల్సినవేవీ చేరేవి కావు. ఈ దుస్థితిని సమూలంగా సంస్కరించడానికే మోడీ పలు వ్యవస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నడో నిరర్థకమైనదిగా మారిన ప్రణాళికా సంఘంతో పాటూ లెక్కకు మించి ఉన్న రకరకాల అధికారిక సంఘాలను, గ్రూపులను రద్దుచేశారు. సత్వర నిర్ణయాలు తీసుకునే వ్యూహ కల్పనలో భాగంగానే పలు చిన్న చిన్న మంత్రిత్వ శాఖల విలీనం వంటి చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో పని సంస్కృతిని పెంచడం కోసం... ప్రతి నెలా ఉత్తమ ఉద్యోగి, ప్రతి ఏటా ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రవేశపెట్టారు. తనతో సహా మంత్రివర్గ సహచరులందరిలోనూ, ప్రతి మంత్రిత్వ కార్యాలయంలోనూ జవాబుదారీతనం, పారదర్శకతల సంస్కృతిని ప్రవేశపెట్టారు. వడి వడిగా.. అభివృద్ధి దిశగా... ఆర్థికాభివృద్ధి శుష్క ప్రవచనాలతో జరిగేది కాదు. ప్రజలకు కావలసింది... తమ బతుకులు బాగుపడటంతో పాటు, దేశం పటిష్టంగా, సురక్షితంగా ఉండటం. అందుకు హామీని ఇవ్వగల సుస్థిర ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు. ఆ బాధ్యతను భుజస్కంధాలకెత్తుకున్న ప్రధాని మోడీ... విధాన పరమైన లోపాలకు తావు లేకుండా పారిశ్రామికాభివృద్ధిని, మొత్తంగా జాతీయ ఉత్పత్తిని త్వరితగతిన పెంపొందింపజేయడానికి చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల కీలకమైన దేశ రక్షణ రంగంలో సైతం లక్షల కోట్ల విలువైన పనులు మూలన పడ్డాయి. మోడీ ప్రభుత్వం చక చకా 30 వేల కోట్ల రూపాయల పనుల ఫైళ్లను ఖరారు చేసి దేశ రక్షణ పట్ల దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కొన్ని కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ఈ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాలలో ఒకటి. అలా అని స్వావలంబన లక్ష్యాన్ని విస్మరించలేదు. రక్షణ రంగం సహా భారత్ తన కాళ్లపై తాను నిలిచేలా అన్ని రంగాలలోనూ చర్యలను చేపట్టారు. మన దేశం పెద్ద అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా వృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. దిగొచ్చిన ధరలు... గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతకు ముందు 4.1 శాతంగా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఇప్పుడు 5.7 శాతానికి చేరింది. మరీ ముఖ్యంగా సామాన్యుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయగలిగారు. ఉల్లి, టమోట, ఆలుగడ్డ తదితర కాయగూరలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తేవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం, ఎగుమతి-దిగుమతి విధానంలో మార్పులు చేయడం వంటి చర్యలను చకచకా చేపట్టడం వల్లనే అది సాధ్యమైంది. అక్రమ నిల్వదారులపట్ల చేపట్టిన కఠిన వైఖరి సైతం సత్ఫలితాలను ఇచ్చింది. ఆదర్శ గ్రామాలు ఎలాగంటే... బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్మార్ట్ సిటీస్, ఆదర్శ గ్రామాలు, జన ధన్ యోజన, అందరికీ విద్యుత్ తదితరమైన ముఖ్య వాగ్దానాలను చేసింది. తక్షణమే వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందకుపైగా స్మార్ట్ నగరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అధునాతన సౌకర్యాలు కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది. కిక్కిరిసిన పెద్ద నగరాలపై వలసల భారాన్ని తగ్గించడం, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం అనే ప్రధాన లక్ష్యాలతో స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంటు సభ్యులు తమకు కేటాయించిన నిధులతో ప్రతి ఏటా ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేయాలని నిర్దేశించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి శ్రామికులు వలస పోవాల్సిన స్థితిని నివారించడం సాధ్యమవుతుంది. అలాగే నానాటికీ ‘సాగుబడి’ క్షీణించిపోయే స్థితిని వెనక్కు మరల్చగలగడం సాధ్యమని నిపుణుల అంచనా! వచ్చే ఐదేళ్లలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ను సరఫరా చేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘పవర్ టు ఆల్’ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. గాంధీ జయంతి నాడు ప్రారంభించే ఈ పథకానికి ఎంపికైన మూడు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆర్థిక అంటరానితనానికి చెల్లు చీటి నేటికీ గ్రామీణ ప్రాంతాలలో నూటికి 60 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ ఆర్థిక అంటరానితనం ఫలితంగానే ప్రభుత్వ సహాయం అత్యవసరమైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడం లేదు. దీనిని రూపుమాపే లక్ష్యంతోనే ప్రధాని యుద్ధ ప్రాతిపదికపై జన ధన్ యోజన పథకాన్ని అమలు చేయిస్తున్నారు. మూడు రోజుల్లోనే సుమారు 3 కోట్ల ఖాతాలు తెరిచారంటేనే ప్రజలు ఇలాంటి అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. జన ధన్ యోజన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా చేస్తుంది, పేదలకు చేరాల్సిన నిధులను కాజేసే స్వార్థపర శక్తుల ఆట కట్టిస్తుంది. అవినీతిని రూపుమాపడానికి, దొంగనోట్ల చెలామణీని అరికట్టడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరగడం అవసరం. ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించినా అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నది ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.500 నుంచి 1000 రూపాయలకు పెంచడం. దీని వల్ల దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. పాలకులైనా, అధికారులైనా, ప్రభుత్వాలైనా... ఇలా ఎవరైనా విశ్వసించాల్సింది ఈ దేశ పౌరుల్నే. అందుకే నరేంద్ర మోడీ ఈ దేశ పౌరులే పెద్ద గెజిటెడ్ అధికార్లుగా భావించారు. దేశ పౌరులు తమకు తాముగా ఇచ్చే స్వయం ప్రకటిత అఫిడవిట్లు చెల్లుబాటవుతాయని చెప్పారు. ప్రధాని నోట ఏ మాట వచ్చినా అది సామాన్యులను ఉద్దేశించినదే. అందుకు ఆగస్టు 15న ఆయన ఎర్రకోట నుండి చేసిన ప్రసంగమే తిరుగులేని సాక్ష్యం. పర్యావరణాన్ని కాపాడండి, పరిశుభ్రతను పాటించండి. విద్యుత్‌ను పొదుపు చేయండి, మీ పిల్లలకు (మీ కుమారులకు) ఏది ఒప్పో ఏది తప్పో చెప్పి నియంత్రించేలా చూడండి అని ఆయన కోరినది కోట్లాది మంది దేశ ప్రజలనే. సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణే పరమ పవిత్ర కర్తవ్యంగా తలదాల్చిన తొలి ప్రధాని... అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేతనని ఈ వంద రోజుల్లో చేసి చూపారు. అంతకు మించి చేయాల్సింది ఏముంది? -నల్లు ఇంద్రసేనారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు -
‘జన్‌ధన్’తో పేదలకు మేలు
శ్రీకాకుళ అర్బన్: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పేదలకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పథకం కింద ప్రతి కుటుంబం రెండు ఖాతాలు తెరిచేలా బ్యాంకులు కృషి చేయాలని శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు కోరారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు. కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. జేసీ జి.వీరపాండ్యన్, ఆంధ్రాబ్యాంకు ఎల్డీఎం ఎం.రామిరెడ్డి, తదితరులు మాట్లాడారు. అంతకుముందు అతిథులు వివిధ బ్యాంకుల ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. కార్యక్రమంలో ఏజేసీ షరీఫ్, ఎస్బీఐ ఏజీఎం రాజారామ్మోనరావు, ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ బి.ఎస్.ఎన్.రాజు, నాబార్డు ఏజీఎం వాసుదేవన్, ఆంధ్రాబ్యాంకు ఏజీఎం రాజేంద్రకుమార్, సిండికేట్ బ్యాంకు ఏజీఎం సాంబిరెడ్డి, ఇతర బ్యాంకు అధికారులు, జిల్లాలోని శాఖాధికారులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో బ్యాంకులది కీలకపాత్ర దేశాభివృద్ధిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఆయన జన్‌ధన్ యోజన ప్రారంభం సందర్భంగా ఖాతాలు తెరిచే కార్యాక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని రూపుమాపి అవినీతి రహిత దేశంగా రూపొందించేందుకు ప్రధానికి అంతా సహకరించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదరికం లేని భారతదేశానికి ప్రధాని, ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని, వారికి అంతా అండగా నిలవాలన్నారు. ఎస్బీఐ ఏజీఎం కె.కామేశ్వరరావు మాట్లాడుతూ జీరో అకౌంట్‌తో ఖాతాలను ప్రారంభించే ఈ కార్యక్రమానికి అనూహ్యై స్పందన వచ్చిందన్నారు. ఆధార్ లేదా ఏదో ఒక గుర్తింపు కార్డుతో వ్యక్తిగత చిరునామాతో అకౌంట్ ప్రారంభించవచ్చునన్నారు. నెలలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త ఖాతాదారులకు పాస్‌బుక్‌లను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు ఎస్.ఎం.బాషా, ఉదయకుమార్సింగ్, కార్యక్రమ నిర్వాహకుడు బి.శ్రీనివాసరావు, యూనియన్ సభ్యుడు ఎం. రమేష్, ఐ.జగన్నాధరావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బాలారిష్టాల్లో ‘మెప్మా’ !
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఏర్పాటైన ‘మెప్మా’ (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. 2007లో జిల్లా యూనిట్‌గా కేం ద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ పథకం క్షేత్రస్థాయిలో లక్ష్యాల్ని సాధించలేకపోతోంది. జిల్లాలో రెండేళ్ల క్రితం అట్టడుగుస్థాయిలో ఉన్న ఈ పథకాన్ని ప్రస్తుత సిబ్బంది ముందుకు తీసుకువెళ్తున్నా ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందని ఉద్యోగులే చెబుతున్నారు. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు మోకాలడ్డు ఈ పథకాన్ని ఇప్పటికీ వివిధ విభాగాల సహాయంతోనే నడిపిస్తున్నారు. డిప్యుటేషన్లపై సిబ్బందిని రప్పించి, మరికొంతమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోనే అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో పీడీతో పాటు ఆరుగురు పీఆర్పీ (పావర్టీ రీసోర్స్ పర్సన్), మున్సిపాలిటీ అనుబంధ విభాగ సిబ్బందిగా మరో 24 మంది, స్థానిక కార్యాలయంలో 11 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ఆరుగురే ఉండగా.. మిగతా వారు పొరుగు సేవల విభాగం (ఏజెన్సీ) కింద వచ్చినవారే. వీరు ఎప్పుడుంటారో, ఎప్పుడు బయటకు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. సంస్థలో కొన్నాళ్ల పాటు శిక్షణ పొందిన సిబ్బంది బయటకు వెళ్లిపోతే వీరి స్థానంలో వచ్చే కొత్త సిబ్బంది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబెడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఔట్సోర్సింగ్ సిబ్బందికి జూలై 31తో గడువు ముగిసినా ప్రభుత్వం డిసెంబర్ వరకు గడువు పొడిగించింది. అయితే పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే మెప్మా నిర్వహకులుగా ప్రభుత్వం నియమిస్తే ఫలితాలుంటాయని ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కొన్ని నిధులు, కేంద్రం నుంచి సబ్సిడీ, బ్యాంకుల నుంచి లింకేజీలతోనే ప్రస్తుతం నడుస్తోంది. ప్రత్యేక వ్యవస్థగా గుర్తిస్తే ఇతర ప్రభుత్వ విభాగాలుగా పట్టణ పేదలకు మరింత సేవలందించవచ్చని సిబ్బంది చెబుతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సహాయంతో సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టి, సొసైటీ యాక్ట్ ప్రకారం కాకుండా స్వతంత్ర కమిటీలతో మెప్మాను పరిగణించాలని కోరుతున్నారు. ఇప్పుడున్న సిబ్బందికి మూడింతల సిబ్బంది అవసరం కూడా ఉంది. వీరికిచ్చిన శిక్షణ ఆధారంగానే క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు, మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామీణ స్థాయిలోనూ.. గతంలో మెప్మా ఆధ్వర్యంలోని పలు పథకాలు పట్టణాల్లోని పేదలకే వర్తించేవి. అయితే కేంద్రం ఇటీవల పథకాల్లో మార్పులు తెచ్చి గ్రామీణ నిరుపేదలు, నిరుద్యోగులకూ వర్తించేలా చట్టం చేసింది. వాస్తవానికి గ్రూపులుగా సభ్యులేర్పడి కేవలం మహిళలకే పథకాలు వర్తించేలా తొలుత ఈ పథకం ప్రారంభమైనా రాన్రాను అన్ని వర్గాలకూ (తెల్లరంగు రేషన్ కార్డు ఉన్న వర్గాలు) చేరేలా మార్పులు చేశారు. జిల్లాలో 4,733 స్వయం సహాయక (ఎస్‌హెచ్‌జీ) గ్రూపులున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించిన రుణమాఫీ ఈ గ్రూపులకూ వర్తిస్తుందని ప్రకటించడంతో ఆయా సంఘాల సభ్యులు సకాలంలో బ్యాంకులనుంచి తీసుకున్న రుణాల్ని చెల్లించలేకపోయారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ రుణాలు మాఫీ అయిపోతాయని భావించినా, బ్యాంకు నిబంధనలు, ప్రభుత్వ ఆంక్షలు వెరసీ వీరు తీసుకున్న మొత్తాలకు భారీగా వడ్డీ చెల్లించాల్సివస్తోంది. ఇది మహిళలకు శరాఘాతంలా మారింది. కొన్ని ప్రాంతాల్లో మెప్మా పథకాల కింద రుణాలు పొందిన సంఘాలకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం, ఆర్ ఆర్ యాక్టు కింద రికవరీ చేస్తామని హెచ్చరికలు వస్తున్నా.. ఈ పథక నిర్వహకులు, అధికారులు, ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతోంది. ప్రచారమూ కరువే.. మెప్మా సంస్థ జిల్లాలోని పట్టణ స్వయం ఉపాధి (అర్బన్ సెల్ఫ్ ఎంప్లాయూమెంట్) సెర్ఫ్, బంగారుతల్లి, స్వయం ఉపాధి కార్యక్రమం (ఎస్ఈపీ), వీధి వ్యాపారుల పాలసీ, సిటీ లైవ్లీ హుడ్ సెంట ర్లు, పట్టణ, గ్రామీణ పేదలకు వర్తించే ఈ తరహా అన్ని కార్యక్రమాల్లోనూ అవగాహన లోపం కనిపిస్తోంది. స్పెషలాఫీసర్ల కింద ఈ సంస్థలో కొంతమంది సిబ్బంది పనిచేస్తూ శిక్షణ కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో లక్ష్యాలు లేవు. పేదలకు రక్షణగా భవిష్యత్తులో ఈ యూనిట్ అధికారులు మరిన్ని కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నా.. సిబ్బంది కొరత కారణంగా ఇప్పుడున్న పథకాలకే ప్రచారం కరువవుతోంది. కొత్త పథకాల పరిస్థితి మరెలా ఉంటుందో చూడాలి. బడ్జెట్ కేటాయింపుల్లోనూ మెప్మా పథకాల ప్రచారానికి సంబంధించి నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిక్షణ కార్యక్రమాలకూ డబ్బులు రావడం లేదు. అలాగే నిధులు లేక సంబంధిత కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. -
‘జన్ ధన్ ’తో ఆర్థిక సమానత
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు జిల్లాలో పథకం ప్రారంభం విశాఖపట్నం : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించుకునే దిశగాప్రధాని నరేంద్రమోడీ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని జిల్లాలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. జిల్లాపరిషత్‌లో గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఆర్థిక సమానత్వాన్ని ఆకాంక్షించినా మన పాలకులంతా సుదీర్ఘ నిద్రలో మునిగిపోయారని ఆరోపించారు. ఇదే విషయమై దృష్టి సారించిన ప్రధాని మోడీ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఒక ఏడాది కాలంలో కోటి బ్యాంక్ ఖాతాలను ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకోగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1.50 కోట్ల ఖాతాలు ప్రారంభించడం విశేషమన్నారు. ఈ బ్యాంక్ ఖాతాలు తీసుకున్న వారికి రూ.లక్ష మేరకు బీమా సదుపాయం, రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్, ఏటీఎం కార్డుల సదుపాయం ఉంటుందన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 597 బ్యాంక్ బ్రాంచీలు ఉండగా గంట వ్యవధిలో 74వేల ఖాతాలు తెరిచారన్నారు. విశాఖ ఎంపీ కె.హరిబాబు, జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయటంతో ఎస్బీఐ అగ్రగామిగా ఉందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ అశ్విని మెహతా అన్నారు. ఎస్బీఐ ఒక్క విశాఖ ప్రాంతంలోనే పదివేల ఖాతాలు ప్రారంభించిందని అన్నారు. ఎస్బీఐ డీజీఎంకె. నరసింహనాయక్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం మంత్రి అశోక్‌గజపతిరాజు ఇద్దరు ఖాతాదారులకు బ్యాంక్‌ఖాతాలు, ఏటీఎం కార్డులు అందజేశారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, నాబార్డు జీఎం కిషన్‌సింగ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
స్టాళ్లను సందర్శించిన సీఎం
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) :జనధన్ యోజనను ప్రారంభించేందుకు గురువారం స్థానిక చెరుకూరి కల్యాణమండపానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బ్యాంకులు, వివిధ శాఖలకు చెందిన 16 స్టాళ్లను అక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్‌కు ముఖ్యమంత్రి వెళ్లి వినియోగదారులకు వారు అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ ఆధీనంలోని మెప్మా ఏర్పాటు చేసిన స్టాల్‌కు వెళ్లి మహిళా రుణాలకు సంబంధించిన ప్రతీ రసీదు ఇకపై తెలుగులోనే అందజేయాలని సూచించారు. మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న వీరపండు, దినేష్ అనే విద్యార్థులతోను, పట్టాభిరామయ్య అనే రైతుతోను మాట్లాడారు. చంద్రబాబుకు మేయర్ వినతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నగర మేయర్ పంతం రజనీ శేష సాయి కొన్ని ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం అందచేశారు. నల్లా ఛానల్ అభివృద్ధి, ఎస్టీపీ ప్లాంట్ వినియోగం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగునకు రూ. 240 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే నగరంలో, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇతర గ్రామాలు కలసినా నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు రూ. 170 కోట్లతో పనులు చేసేందుకు జనరల్ ఫండ్ నుంచి నిధులను మంజూరు చేయాలని కోరారు. అలాగే కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలన్నారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఉన్నారు. ప్రజా ప్రతినిధులందరూ రాజకీయ పార్టీలకు చెందినవారే మధురపూడి: మన దేశంలో ఏ ప్రజాప్రతినిధి అయినా ఏదో ఒక రాజకీయపార్టీ నుంచి వచ్చిన వారే నని టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ పేర్కొన్నారు. కొందరు సీనియర్ నాయకులను గురువారం విమానాశ్రయంలోకి పోలీసులు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విలేకరులతో గన్ని కృష్ణ మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలకు తనకు ఆహ్వానం కూడా పంపించకపోవడంపై ఆయన అసంతృఫ్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, లేకపోతే తగిన సమాధానం చెబుతామని ఆయనహెచ్చరించారు. కోనేరు వివేక్, తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
ఏపీ, తెలంగాణలో జన ధన పథకం ప్రారంభం!
హైదరాబాద్: ప్రధానమంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభించారు. హైదరాబాద్, రాజమండ్రిలో జరిగిన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడులు పాల్లొన్నారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్డీఏ కూటమి ఈ పథకాన్ని రూపొందించింది అని అన్నారు. వివిధ పథకాల లబ్దిదారులకు, పెన్షన్ దారుల బ్యాంక్ అకౌంట్ల కు ప్రత్యక్షంగా నగదు బదిలీ జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని కూడా ఈ పథకం రూపుమాపుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు, భారతీ పరిశ్రమలశాఖామంత్రి అనంత్ గీతేలు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండటం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. జీరో బ్యాలెన్స్‌తో ప్రారంభించే ఈ ఖాతాలు ఉన్న కుటుంబాలకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రధానమంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పేదరికంపై పోరాటమే ఈ పథకం లక్ష్యం
-
జనధన యోజన ప్రారంభం
జనధన యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 76 కేంద్రాల్లో ఈ పథకం ఒకేసారి ప్రారంభమైంది. ప్రతి కుటుంబానికి కూడా బ్యాంకు ఖాతా ఉండటం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. జీరో బ్యాలెన్స్‌తో ప్రారంభించే ఈ ఖాతాలు ఉన్న కుటుంబాలకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రధానమంత్రి ఇంతకుముందే ప్రకటించారు. దీనివల్ల ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబం కష్టాల పాలు కాకుండా ఈ మొత్తం ఆదుకుంటుందని అంటున్నారు. తొలి రోజున కోటి మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మార్గదర్శకాలు రూపొందించారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు వస్తుందన్నారు. -
జన ధన యోజన.. తొలిరోజు కోటి అకౌంట్లు!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అందరికీ బ్యాంక్ అకౌంట్లు లక్ష్యంగా ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ఆగస్టు 28న అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో ఘనంగా ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. మొదటిరోజే దాదాపు కోటి అకౌంట్లు ప్రారంభమవుతాయని అంచనా. ఆధార్ అనుసంధాన అకౌంట్లకు రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, పేదవర్గాల కోసం డెబిట్ కార్డు, బీమా కవరేజీ వంటి సదుపాయాలతో బ్యాంకు ఖాతాలు అందించే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వాతంత్య్ర దినోత్సవం రోజు జన ధన యోజన పథకాన్ని ప్రకటించారు. 28వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభానికి దేశ వ్యాప్తంగా దాదాపు 76 చోట్ల భారీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పథకం (అందరికీ బ్యాంక్ అకౌంట్ల లభ్యత) గురించి ప్రధానమంత్రి ఇప్పటికే 7.25 లక్షల ఈమెయిల్స్‌ను బ్యాంక్ అధికారులకు పంపినట్లు సమాచారం. ప్రారంభం రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 60,000కు పైగా క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ముందస్తు క్యాంప్‌ల ద్వారా ఇప్పటికే విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం విజయవంతానికి ఇప్పటికే పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటుండగా, పలు సంస్థలు సైతం ఈ దిశలో తమ సహకారం అందిస్తామని ప్రకటించాయి. ఈ ధన జన యోజన కార్యక్రమం మొదటిదశ ఈ నెల్లో ప్రారంభమై వచ్చే యేడాది ఆగస్టులో ముగుస్తుంది. రెండవదశ 2015 నుంచి 2018 వరకూ కొనసాగుతుంది. తెలంగాణలో జన ధన యోజన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందరికీ ఆర్థిక సేవలను అందించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి జన ధన యోజన పథకాన్ని ఆగస్టు 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్రానికి స్టేట్ లెవల్ బ్యాంకర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొంటారని ఎస్బీహెచ్ తెలిపింది. అన్ని బ్యాంకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఖాతాదారులకు లక్ష రూపాయల ప్రమాద బీమా రక్షణతో పాటు రూపే డెబిట్ కార్డును అందచేస్తారు.