
జన్‌ధన్‌లో డూప్లికేషన్లు: సర్వే
న్యూఢిల్లీ: జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద అకౌంట్ల డూప్లికేషన్ భారీగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. 28%కిపైగా అకౌంట్లు క్రియారహితంగా ఉన్నట్లు కూడా ఈ సర్వే తేల్చింది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు సంబంధించి మైక్రోసేవ్ అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన సర్వే ఈ అంశాలను వివరించింది. సర్వేకి సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
* 17 రాష్ట్రాల్లోని 42 జిల్లాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సర్వే జరిగింది. దాదాపు 6,000 మంది అభిప్రాయాలను ఈ సర్వే తీసుకుంది.
* ఈ అకౌంట్లు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు, సబ్సిడీలు అందిస్తాయని, దీనివల్ల బహుళ లాభాలు ఉంటాయని పలువురు భావించడం ఈ అకౌంట్ల పెరుగుదలకు ఒక కారణం.
* పీఎంజేడీవై మాత్రమే తమ మొట్టమొదటి అకౌంట్ కాదని 33% మంది కస్టమర్లు తెలిపారు.
* అప్పటికే ఒక అకౌంట్ ఉండీ, పీఎంజేడీవై అకౌంట్ తెరిచిన వారు, తమ తొలి అకౌంట్‌నే ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు.