ఏపీ, తెలంగాణలో జన ధన పథకం ప్రారంభం!
హైదరాబాద్: ప్రధానమంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభించారు. హైదరాబాద్, రాజమండ్రిలో జరిగిన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడులు పాల్లొన్నారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్డీఏ కూటమి ఈ పథకాన్ని రూపొందించింది అని అన్నారు.
వివిధ పథకాల లబ్దిదారులకు, పెన్షన్ దారుల బ్యాంక్ అకౌంట్ల కు ప్రత్యక్షంగా నగదు బదిలీ జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని కూడా ఈ పథకం రూపుమాపుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు, భారతీ పరిశ్రమలశాఖామంత్రి అనంత్ గీతేలు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండటం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.
జీరో బ్యాలెన్స్తో ప్రారంభించే ఈ ఖాతాలు ఉన్న కుటుంబాలకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రధానమంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే.