కరోనా వైరస్ ప్రభావంతో పర్యాటక రంగం ఎఫెక్ట్ ... ప్రయాణాలకు బ్రేక్... లగేజ్‌కు నో డిమాండ్... అంటే ఖండిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ రంగానికి చెందిన వీఐపీ షేరుపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఈపీఎస్(ఎర్నింగ్ పర్ షేరు) అంచనాలను 50శాతం వరకు తగ్గించారు. అయితే వారు ఇప్పటికీ ఈ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉండటం విశేషం. వారి అంచనాలకు తగ్గట్లు దేశీయ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దంపతులు ఈ కంపెనీలో వాటాను పెంచుకున్నారు.
మార్చ్ క్వార్టర్ షేర్‌హోల్డింగ్ డాటాను పరిశీలిస్తే... ఈ త్రైమాసికంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 2.85లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. దీంతో కంపెనీలో అతడి వాటా 1.42శాతం నుంచి 1.62శాతానికి పెరిగింది. అలాగే అతని సతీమణి షేర్లను విక్రయించకపోవడం 3.69శాతంగానే ఉంది.
బ్రోకేరేజ్ సంస్థల నివేదికలు:
ఐడీబీఐ క్యాపిటల్: వరుస రెండేళ్లగా బలహీనంగా సర్వీసు రంగానికి అసాధారణ డిమాండ్ నెలకొనడంతో లగేజ్ ఇండస్ట్రీస్ బలపడింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం(ఎఫ్‌వై 22)లో మరింత రికవరిని సాధిస్తుంది. ఈ నేపథ్యంలో వీఐపీ కంపెనీ అదే ఏడాది(ఎఫ్‌వై 22)లో అమ్మకాలు 22శాతం, ఎబిటిడా 35శాతం వృద్ధిని సాధిస్తుంది. షేరుకు టార్గెట్ రూ.275గా నిర్ణయించడమైంది. కేటాయించిన టార్గెట్ ధర ప్రస్తుత ధరకు 25శాతం అప్‌సైడ్ పొటెన్షియల్‌ను కలిగి ఉంది.
కోటక్ సెక్యూరిటీస్: వీఐపీ తన సహచర కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తుంది. వ్యయాలకు తగ్గించుకోవడం, సేవింగ్స్‌పై దృష్టిని పెట్టడం లాంటి చర్యలు మార్జిన్ల పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకోవడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం 21 - 22 ఆదాయాల డిమాండ్‌పై కోవిడ్ -19 ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక షేరుకు గతంలో కేటాయించిన టార్గెట్ ధర(రూ.320)ను రూ.295గా తగ్గించడమైంది. అయితే షేరుపై మాత్రం ‘‘బై’’ రేటింగ్ కొనసాగిస్తామని బ్రోకేరేజ్ సంస్థ తెలిపింది.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్: జూన్ త్రైమాసికం కంపెనీకి ఒక క్లిష్టమైన కాలం. ఎందుకంటే కంపెనీ ఏడాదిలో వచ్చే మొత్తం ఆదాయంలో 30 శాతం వాటా ఈ క్వార్టర్‌లోనే వస్తుంది. అలాగే 45శాతం లాభదాయం ఇదే త్రైమాసికంలో వస్తుంది. కరోనాను అరికట్టేందుకు చాలా రాష్ట్రాలు షాపింగ్ మాల్స్‌ను మూసివేశాయి. రిటైల్ వ్యాపారస్థులు తన అమ్మకపు గంటలను తగ్గించారు. అమ్మకాలు కేవలం 5 శాతం మాత్రమే నమోదు కావడంతో ఏప్రిల్-మే నెలల్లో నష్టం గణనీయంగా ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయాల పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. వివాహాలను వాయిదా వేయడం కూడా పెద్ద ఆందోళన కలిగించే అంశం మారింది. వీఐపీ ఆదాయంలో వివాహ సీజన్ అమ్మకాలు 30 శాతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment