బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7 | BMW launches ActiveHybrid 7 | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7

Published Thu, Jul 24 2014 1:46 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7 - Sakshi

బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7

గుర్గావ్: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ బుధవారం అంతా కొత్తదైన బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7 సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.1.35 కోట్లు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). బీఎండబ్ల్యూ భారత్‌లో అందిస్తున్న తొలి హైబ్రిడ్ కారు ఇది.

  ఈ కారు విక్రయాలను బుధవారం నుంచే ప్రారంభిస్తున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సాహా చెప్పారు. పెట్రోల్, లిథియం అయాన్ బ్యాటరీతోనూ(ఎలక్ట్రిక్)నడిచే ఈ హైబ్రిడ్ కారును  సౌకర్యం, స్పేస్‌లలో ఎలాంటి రాజీ పడకుండా అందిస్తున్నామని వివరించారు. ముందు వరుస సీట్లలో ఫోల్డింగ్ టేబుల్స్, వెనక సీట్లలో మస్సాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు  ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఎం3 సెడాన్, ఎం4 కూపే, ఎం5 సెడాన్, ఐ8 కార్లను అందించనున్నట్లుచెప్పారు.
 
 కారు ప్రత్యేకతలు...: 0-100కిమీ వేగాన్ని 5.7 సెకన్లలో అందుకునే ఈ కారు గరిష్ట వేగం 250 కిమీ/గం.  కీ లెస్ ఎంట్రీ, పార్కింగ్ సెన్సర్లు, ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్-వ్యూ కెమెరా, నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ రేడియోతో కూడిన 10 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement