సినీ నిర్మాత పేరుతో బ్రిటన్లో మోసాలు | Bollywood producer among UK's most wanted con artists | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత పేరుతో బ్రిటన్లో మోసాలు

Published Wed, Jul 20 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

సినీ నిర్మాత పేరుతో బ్రిటన్లో మోసాలు

సినీ నిర్మాత పేరుతో బ్రిటన్లో మోసాలు

లండన్: బ్రిటన్‌లో భారీ ఎత్తున పన్ను మోసాలకు పాల్పడిన నిందితుల జాబితాలో భారత సంతతికి చెందిన ఓ నకిలీ సినీ నిర్మాత పేరు ప్రముఖంగా చోటు చేసుకుంది. బ్రిటన్‌లో మోసాలకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా లండన్ పోలీసులు, నేషనల్ క్రైమ్ ఏజెన్సీ సాయంతో దర్యాప్తునకు అవసరమైన నిందితుల జాబితాను విడుదల చేశారు. తూర్పు లండన్‌లోని బెక్‌టన్ ప్రాంతానికి చెందిన సందీప్ అరోరా (42) సినిమాలను నిర్మించకపోయినా, అసలు సినిమాల నిర్మాణంతో అతడికి ఎలాంటి సంబంధం లేకపోయినా... 45 లక్షల పౌండ్ల వ్యాట్, వినోద పన్ను రాయితీలు పొందినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అరోరా ప్రస్తుతం భారత్‌లో ఉండి ఉండవచ్చని, ఇతడి గురించి సినిమా రంగానికి చెందిన కరణ్ అరోరా సహా పలువురికి తెలిసే ఉంటుందని లండన్ పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement