న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్‌ఈ) నేటి(బుధవారం) నుంచి 222 కంపెనీలను డీలిస్ట్ చేయనున్నది. ఈ షేర్లలో 6 వారాలకు పైగా ట్రేడింగ్ సస్పెండ్ కావడంతో బీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకున్నది. అక్రమంగా నిధుల తరలింపునకు డొల్ల కంపెనీలను వినియోగిస్తున్నారని, అలాంటి కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బీఎస్‌ఈ డీలిస్ట్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా తప్పనిసరి డీలిస్టింగ్ నిబంధనల ప్రకారం, డీలిస్ట్ కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించి పూర్తి కాలపు డైరెక్టర్లు, ప్రమోటర్లు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనకుం డా పదేళ్ల పాటు నిషేధం ఉంటుంది. ఈ ఏడాది మేలో స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు మరో 200కు పైగా కంపెనీలను డీలిస్ట్ చేశాయి.
గతేడాది ఆగస్టులో 331 అనుమానిత డొల్ల కంపెనీలపై చర్య లు తీసుకోవాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలం పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం లేదంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment