వచ్చే మార్చికల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ: శ్రీవాస్తవ | BSNL to install 28,000 mobile sites, start 4G in 2018 | Sakshi
Sakshi News home page

వచ్చే మార్చికల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ: శ్రీవాస్తవ

Published Mon, Mar 13 2017 4:41 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

వచ్చే మార్చికల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ: శ్రీవాస్తవ

వచ్చే మార్చికల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ: శ్రీవాస్తవ

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) చివరి నాటికి ఎంపిక చేసిన ప్రదేశాల్లో 4జీ సేవలను అందించేందుకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధమవుతోంది. అన్ని 2జీ సైట్లను 3జీకి మార్చేందుకు వీలుగా 28,000 కొత్త బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ‘‘ఎనిమిదో దశ విస్తరణలో భాగంగా 2జీ బేస్‌ స్టేషన్లను, పాత ఎక్విప్‌మెంట్‌ను ఆధునిక బేస్‌ స్టేషన్లతో మారుస్తున్నాం. ఈ బేస్‌ స్టేషన్లు 3జీ, 4జీ సర్వీసులకు అనుకూలంగా ఉంటాయి. తొలుత కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నాం.

 ఎనిమిదో దశ విస్తరణ పనులు 2017–18 నాటికి పూర్తి అవుతాయి’’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎండీ శ్రీవాస్తవ తెలిపారు. 3జీ స్పెక్ట్రమ్‌లో కొంత భాగాన్ని 4జీ సేవలకు వినియోగించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. బేస్‌ స్టేçషన్ల మార్పిడి ప్రాజెక్టు రేసులో నోకియా, ఎరిక్సన్, జెడ్‌టీఈ ఉన్నాయని... నోకియా తక్కువ బిడ్డర్‌గా వచ్చిందని, ఆ తర్వాత జెడ్‌టీఈ ఉన్నట్టు శ్రీవాస్తవ వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement