హైదరాబాద్‌లో సీడీకే గ్లోబల్ కార్యాలయం | CDK Global Inc launches operations in India | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సీడీకే గ్లోబల్ కార్యాలయం

Published Thu, May 14 2015 12:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌లో సీడీకే గ్లోబల్ కార్యాలయం - Sakshi

హైదరాబాద్‌లో సీడీకే గ్లోబల్ కార్యాలయం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీలు, డీలర్లకు టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తున్న సీడీకే గ్లోబల్ హైదరాబాద్‌తోపాటు పుణేలో కార్యాలయాలను ప్రారంభించింది. హైదరాబాద్‌లో 1,000 సీట్లు, పుణేలో 500 సీట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పింది. రెండు కార్యాలయాల్లో ప్రస్తుతం 800 మంది సిబ్బంది ఉన్నారు. వీటి ఏర్పాటుకు సుమారు రూ.100 కోట్లు వ్యయం చేసింది. నిర్వహణకు ఈ ఏడాది మరో రూ.220 కోట్లు వ్యయం చేస్తామని సీడీకే గ్లోబల్ సీఈవో స్టీవెన్ జె అనెనెన్ తెలిపారు.

కంపెనీ ఇండియా ఎండీ రెడ్డి మల్లెడితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సీడీకే గ్లోబల్‌కు 100 దేశాల్లో 26 వేల మంది క్లయింట్లున్నారు. అమ్మకాలు పెరిగేందుకు కంపెనీ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలున్నాయి’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement