సాక్షి, ముంబై: గత ఏడాది చైనాలోని వుహాన్ నగరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ.. కోవిడ్-19 మహమ్మారిగా అవతరించిన కరోనా వైరస్ ఆర్థికంగా, సామాజికంగా ప్రపంచ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ సోకకుండా వుండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి పుంఖాను పుంఖాలుగా చదివాం. అనేక కథనాలు విన్నాం.. చూశాం. తాజాగా కాన్పెప్ట్ వీడియో (ది పవర్ ఆఫ్ లెటర్స్ ) పేరుతో ఒక ఆసక్తికర వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది. (అద్భుతం : మనకీ ధైర్యం పెరుగుతుంది)
ముఖ్యంగా టెలికాం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో మొదలు పెట్టిన దగ్గుతో ప్రారంభమయ్యే సందేశాలు, సెలబ్రిటీల సూచనలు, పాటలు, కవితలు, వీడియోలు చాలానే చూశాం. భౌతిక దూరాన్ని పాటించడం, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వుండడం,గంటకోసారి చేతులను 20నిమిషాల పాటు శానిటైజర్ తో కడుక్కోవడం చివరకు బయటికి రాకుండా ఇంటికేపరిమితమవుతూ లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తున్నాం. తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి ఒక చక్కటి వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. హృదయ విదారక దృశ్యాలు, బొమ్మలు, వాయిస్ ఓవర్, ఇలాంటి హడావిడి ఏమీ లేకుండా.. కేవలం అక్షరాల పదునుతో సూటిగా.. వైరస్ నిరోధం, నివారణ ఫలితాలను హృదయానికి హత్తుకునేలా వివరించిన ఈ వీడియోను మీరు కూడా చూసి తీరాలి. (ఇ-కామర్స్ కంపెనీలకు మరో షాక్)
I’ve seen so many videos & messages & quotes about finding meaning & value in the lockdown. Without any voice-over, without celebrity-speak, without any pictures, this video brilliantly tells us how to find ourselves... Have a great weekend. pic.twitter.com/eVpDRL7uFz
— anand mahindra (@anandmahindra) April 25, 2020
Comments
Please login to add a commentAdd a comment