సాక్షి, ముంబై : ప్రముఖ, పురాతన ఎసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. కోవిడ్-19 సంక్షోభం కారణం భారత్ లో నిర్వహిస్తున్న 6 ఫండ్స్ మూసివేస్తున్నట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభం భారతీయ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావానికి సంకేతంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ 2020 ఏప్రిల్ 23 నుండి అమలులోకి వచ్చే ఆరు పథకాలను స్వచ్ఛందంగా ముగించాలని నిర్ణయించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్లో పెరిగిన ఉపసంహరణ ఒత్తిడి, క్షీణించిన ద్రవ్యత లభ్యత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
యూనిట్ హోల్డర్ల విలువను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. కరోనా వైరస్ అసాధారణ పరిస్థితులలో ఇదొక్కటే ఆచరణీయమైన మార్గమని పేర్కొంది. తద్వారా రూ .30,800 కోట్ల పెట్టుబడిదారుల సంపద ఇరుక్కుపోయింది. తాజా పరిణామం ఇతర రుణ పథకాలపై కూడా ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బ్యాకప్ లేదా ప్రత్యామ్నాయ నిధుల మార్గాలు లేకపోవడం రాబోయే 3 నెలల్లో ఎన్ బీఎఫసీ రంగం తీవ్ర మైన ఇబ్బందుల్లో పడనుందని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది. ఆ ఫండ్స్ కింద ఉన్న సెక్యూరిటీలను కొద్దికాలం తర్వాత విక్రయించి ఇన్వెస్టర్లకు క్రమంగా చెల్లింపులు జరుపుతామని కంపెనీ తెలిపింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు వివరించింది. మూసేస్తున్న 6 ఫండ్స్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో లిక్విడిటీ సమస్య ఎదుర్కునే ఫండ్స్‌ను మాత్రమే మూసేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్స్ మూసేసి ఇన్వెస్టర్లకు డబ్బులవు వాపసు ఇవ్వడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్టు ఫ్రాంక్లిన్ ఇండియా (ఇండియా) అధ్యక్షుడు సంజయ్ సాప్రే చెప్పారు. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్)
కాగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గురువారం మ్యూచువల్ ఫండ్ల కోసం వాల్యుయేషన్ పాలసీలను సడలించిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఆయా సంస్థలు మెచ్యూరిటీలో పొడిగింపు, లేదా వడ్డీ చెల్లించడంలో ఆలస్యం అయితే వాటిని డిఫాల్ట్‌ర్స్ గా ప్రకటించ వద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకాలను మూసివేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తరువాత, ఈ పథకాల్లోని పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోలేరు. తాజా యూనిట్లను కొనలేరు, ఈక్విటీ పథకాలకు బదిలీ చేయలేరు లేదా వారి నెలవారీ ఖర్చుల నిమిత్తం తమ నిధులను క్రమపద్ధతిలో ఉపసంహరించుకోలేరు. మరోవైపు ఈ విషయం ప్రభుత్వం, ఆర్బీఐ దృష్టికి వెళ్లింది. లిక్విడిటీ సమస్యను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!)
మూసివేస్తున్నట్టు ప్రకటించిన 6 ఫండ్స్
ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్‌కం ప్లాన్
ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రాషార్ట్ బాండ్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం అపార్చునిటీస్ ఫండ్
Comments
Please login to add a commentAdd a comment