
ముంబై: నాలుగు మీటర్లలోపు ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీ), కాంపాక్ట్ ఎస్‌యూవీల మార్కెట్ ఇటీవలికాలంలో శరవేగంగా అభివృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇతర కార్ల పరిశ్రమ 3 శాతం వృద్ధిరేటును నమోదుచేయగా, ఎస్‌యూవీ విభాగం ఏకంగా 11 శాతం చక్రగతి వృద్ధిరేటును నమోదుచేసినట్లు వెల్లడించిన భారత ఆటోమొబైల్ తయారీదార్ల సంఘం (సియామ్).. 2017–18 కాలంలో ఈ విభాగం అమ్మకాలు 9,22,000 యూనిట్లుగా నమోదై, అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం వృద్ధిచెందినట్లు తెలిపింది. ఇంతటి వేగంగా దూసుకుపోతున్న మార్కెట్‌ను ఇక నుంచి పెద్ద ఎస్‌యూవీలు సొంతం చేసుకోనున్నట్లు మార్కెట్ పరిశోధన సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ అంచనా వేసింది.
2019 తొలి అర్ధభాగంలో విడుదలకానున్న పలు కంపెనీల ఎస్‌యూవీల సమాచారం ఆధారంగా తమ అంచనాను వెల్లడించినట్లు తెలియజేసిన ఈ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ పునీత్ గుప్తా.. 2021 నాటికి కాంపాక్ట్ ఎస్‌యూవీల కంటే నాలుగు మీటర్లు మించిన బిగ్ ఎస్‌యూవీల అమ్మకాలు 35 శాతం వృద్ధిరేటును సాధించవచ్చని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. సులభంగా ఫైనాన్స్ సాకర్యం అందుబాటులో ఉండడం, ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుండటం ఆధారంగా రూ.12 లక్షలు–రూ.15 లక్షల ఎస్‌యూవీల మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందనుందని అంచనావేశారు. వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న టాటా మిడ్–సైజ్ ప్రీమియం హరియర్, మహీంద్రా ఎస్201, కియా ఎస్‌పీ, ఎమ్‌జీ మోటార్స్ బోజూన్ 530, హోండా హెచ్‌ఆర్–వి ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment