డీ–మార్ట్‌ దమానీ వాటా విక్రయం! | D-Mart logs its second-biggest drop | Sakshi
Sakshi News home page

డీ–మార్ట్‌ దమానీ వాటా విక్రయం!

Published Sat, May 19 2018 12:40 AM | Last Updated on Sat, May 19 2018 12:40 AM

D-Mart logs its second-biggest drop - Sakshi

న్యూఢిల్లీ: అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ 1 శాతం వరకూ వాటాను (62.4 లక్షల ఈక్విటీ షేర్లను) విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయ విలువ రూ.884 కోట్ల మేర ఉంటుందని అంచనా. డీ–మార్ట్‌ పేరుతో రిటైల్‌ స్టోర్స్‌ను అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనల ప్రకారం కంపెనీ ప్రమోటర్‌ దమానీ 1 శాతం మేర వాటా విక్రయించనున్నట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ బీఎస్‌ఈకి నివేదించింది.

ఈ షేర్ల విక్రయం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 14 మధ్య జరగవచ్చని పేర్కొంది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టైన కంపెనీలో కనీసం 25 శాతం వాటాను ప్రజలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ వాటా విక్రయ వార్తల నేపథ్యంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేర్‌ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. గురువారం రూ.1,495 వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం రూ.1,379, 1,504 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 5 శాతం నష్టంతో రూ.1,416 వద్ద ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement