నవంబర్లో ‘సేవల’ తిరోగమనం
• దెబ్బతీసిన డీమోనిటైజేషన్
• 54.5 నుంచి 46.7కు తగ్గుదల
• నికాయ్ ఇండియా సర్వీస్ పీఎంఐ సర్వే
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ఫలితంగా నవంబర్‌లో దేశీయ సేవల రంగం పనితీరు కుంటుపడింది. మూడేళ్లలోనే గరిష్ట స్థారుులో క్షీణతకు లోనైంది. కొత్త ఆర్డర్లు బాగా తగ్గిపోవడం, నగదు లేక కస్టమర్లు ఖర్చులను తగ్గించుకోవడం వంటివి సేవల రంగంపై ప్రతికూల ప్రభావం చూపించారుు. ఈ పరిస్థితుల్లో రేట్లను తక్కువ స్థారుులోనే కొనసాగించేందుకు ఆర్‌బీఐపై ఒత్తిళ్లు పెరిగినట్టు నికాయ్ ఇండియా సర్వీస్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సర్వే వెల్లడించింది. సేవల రంగం పనితీరుపై ఈ సూచీ నెలవారీ గణాంకాలను వెల్లడిస్తుంటుంది.
నవంబర్‌లో ఇది 46.7గా నమోదవగా... అక్టోబర్లో మాత్రం 54.5 దగ్గర ఉండడం గమనార్హం. ఇక, నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ కూడా అక్టోబర్‌లో నమోదైన నాలుగేళ్ల గరిష్ట స్థారుు 55.4 నుంచి... నవంబర్‌లో 45కు పడిపోరుుంది. 2015 జూన్ తర్వాత సేవల రంగం క్షీణించడం మళ్లీ ఇదే. ఒకేసారి భారీ స్థారుులో తగ్గడం అన్నది కూడా మూడేళ్ల కాలంలోనే మొదటి సారి. సూచీ 50కి పైన ఉంటే విస్తరణగా, దిగువన ఉంటే దాన్ని క్షీణతగా పేర్కొంటారు.
స్వల్ప కాలం పాటే...: ‘‘సేవల రంగానికి సంబంధించి నికాయ్ పీఎంఐ తాజా గణాంకాలు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల కంపెనీలు తీవ్రంగా ప్రభావితమైనట్టు తెలియజేస్తోంది. నగదు కొరత వల్ల కొత్తగా వ్యాపార ఆర్డర్లు తగ్గారుు. దీంతో క్షీణత చోటు చేసుకుంది’’ అని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త పొల్యన్న డీలిమా తెలిపారు. వ్యాపార కార్యకలాపాలకు విఘాతం అనేది స్వల్ప కాలం పాటే ఉంటుందన్నారు. బెంచ్‌మార్క్ రేటు తగ్గింపును అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సేవల రంగం క్షీణించడం ఆశ్చర్యకరం ఏమీ కాదని, తయారీ కంటే సేవల రంగంలో అవ్యవస్థీకృత వాటా (45%) ఎక్కువగా ఉన్నట్టు జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం నోమురా తన నివేదికలో పేర్కొంది.
వ్యాపార విశ్వాసం పెరిగింది...
ఒకవైపు సేవల రంగం కుంటుపడగా... వ్యాపార విశ్వాసం మాత్రం మూడు నెలల గరిష్ట స్థారుుకి చేరుకుంది. అధిక విలువ కలిగిన నోట్లను మళ్లీ వ్యవస్థకు అందుబాటులోకి తేవడం, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సానుకూల విధానాలు, అవ్యవస్థీకృత కంపెనీలు తప్పుకోవడం వంటివి సెంటిమెంట్‌ను మెరుగుపరిచినట్టు నికాయ్ సర్వే పేర్కొంది.