పనితీరు ఆధారంగా బ్యాంకులకు మూలధనం సరైందే | Deputy governor R Gandhi hails new recapitalisation plan for PSBs | Sakshi
Sakshi News home page

పనితీరు ఆధారంగా బ్యాంకులకు మూలధనం సరైందే

Published Tue, Feb 10 2015 2:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

పనితీరు ఆధారంగా బ్యాంకులకు మూలధనం సరైందే - Sakshi

పనితీరు ఆధారంగా బ్యాంకులకు మూలధనం సరైందే

న్యూఢిల్లీ: బ్యాంకులకు కేంద్రం తాజా మూలధనాన్ని సమకూర్చే విషయంలో వాటి ‘పనితీరు’ను ప్రామాణికంగా తీసుకోవాలన్న కేంద్రం యోచన సరైందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ  సోమవారం అభిప్రాయపడ్డారు. బ్యాంకుల సామర్థ్యం మెరుగుదలకు ఇది తగిన సంకేతమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఐఎన్‌జీ వైశ్యా వంటి ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో సైతం మొండిబకాయిల సమస్య ప్రారంభమైందన్నారు.

డిసెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ రుణాలు మొండిబకాయిలుగా మారడం దీనికి కారణమని అన్నారు.  గత వారాంతంలో రూ.6,990 కోట్ల తాజా కేపిటల్ ప్రకటన విషయాన్ని గాంధీ ప్రస్తావిస్తూ, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి సంస్థలకు తాజా నిధులు అందే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement