హెచ్‌ 1 బి వీసా: మరింత కఠినం | Donald Trump administration makes H1-B visa approval tougher | Sakshi
Sakshi News home page

హెచ్‌1 బి వీసా: మరింత కఠినం

Published Fri, Feb 23 2018 12:08 PM | Last Updated on Wed, Sep 26 2018 6:40 PM

Donald Trump administration makes H1-B visa approval tougher - Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌ 1 బీ వీసాల విధానాన్ని మరింత కఠిన తరం చేస్తూ  అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని  అమలు చేయనుంది. వీసా జారీ ప్రక్రియ మరింత కఠినతరం చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం కొత్త విధానాన్ని జారీ చేసింది.  మూడు సంవత్సరాల పాటు  అమలయ్యే వీసాలను జారీ చేసే సంప్రదాయాన్ని రివర్స్ చేస్తూ  సంచలనం నిర్ణయం తీసుకుంది.

ఈ విధానం జారీ చేసే వీసాలు కొంత కాలంమాత్రమే చెల్లుబాటయ్యేలా  చేయన్నానున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోపేనని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం, వీసా పొడిగింపు సమయంలో  థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్‌ 1 బీ  వీసా ఉన్న ఉద్యోగి ప్రత్యేక వృత్తిలో నిర్దిష్టమైన, నాన్‌  క్వాలిఫైయింగ్ అర్హతలు కలిగి వున్నాడని  నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏడు పేజీల విధానాన్ని అమెరికా సిటిజన్‌షిప్‌అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌  బుధవారం జారీ చేసింది.  ఇది భారత ఐటీ కంపెనీలు,  వారి ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం  చేయనుంది.  

అమెరికాలో ఉద్యోగాలు- స్థానికులకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో హెచ్-1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది వారాల్లో వీసా ప్రాసెసింగ్‌  మొదలుకానుండగా ఈ షాకింగ్‌ పాలసీ విడుదల చేయడం భారతీయ ఐటీ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హెచ్-1బీ వీసా నూతన నిబంధనల ఇటు భారతీయులకేకాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం జరుగుతుందని  నాస్కామ్‌ అధ్యక్షుడు , ఆర్‌.చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. అటు దీంతో స్టాక్‌మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement