tougher measures
-
ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ క్రియేట్ చేస్తున్నారా?
సాక్షి న్యూఢిల్లీ: ఆన్లైన్లో రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో వినియోగదారులకు ఊరట. రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐర్సీటిసి) త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను మరింత కఠినం చేయనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఏజెంట్‌గా పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లతో నకిలీ ఐడీలనుసృష్టించి, తద్వారా తత్కాల్ సహా, ఆన్లైన్లో టికెట్ విక్రయాల్లో అక్రమ దందాకు చెక్ చేపట్టేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీలో యూజర్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన నిబంధలను పటిష్టం చేయనుంది. వెబ్సైట్లో యూజర్ల నమోదుకు మరిన్ని గుర్తింపులను కోరనుంది. ఐఆర్సీటీసీ వినియోగదారుని ఐడి,పాస్వర్డ్, మొబైల్ నంబర్‌తోపాటు ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి ఇతర ముఖ్యమైన ఐడీలను కూడా వినియోగదారుని కోరనుంది. బినామీ పేర్లతో నకిలీ ఐడీలతో ఏజెంట్లు పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్న వైనం తెలిసిందే. వేలాది నకిలీ యూజర్ ఐడిల ద్వారా ఇ-టికెట్లను బ్లాక్ చేసి, వాటిని అధిక ధరకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు అధికారులు దృష్టి సారించారు. -
హెచ్ 1 బి వీసా: మరింత కఠినం
వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాల విధానాన్ని మరింత కఠిన తరం చేస్తూ అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. వీసా జారీ ప్రక్రియ మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం కొత్త విధానాన్ని జారీ చేసింది. మూడు సంవత్సరాల పాటు అమలయ్యే వీసాలను జారీ చేసే సంప్రదాయాన్ని రివర్స్ చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం జారీ చేసే వీసాలు కొంత కాలంమాత్రమే చెల్లుబాటయ్యేలా చేయన్నానున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోపేనని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం, వీసా పొడిగింపు సమయంలో థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్ 1 బీ వీసా ఉన్న ఉద్యోగి ప్రత్యేక వృత్తిలో నిర్దిష్టమైన, నాన్ క్వాలిఫైయింగ్ అర్హతలు కలిగి వున్నాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏడు పేజీల విధానాన్ని అమెరికా సిటిజన్‌షిప్‌అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ బుధవారం జారీ చేసింది. ఇది భారత ఐటీ కంపెనీలు, వారి ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అమెరికాలో ఉద్యోగాలు- స్థానికులకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో హెచ్-1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది వారాల్లో వీసా ప్రాసెసింగ్ మొదలుకానుండగా ఈ షాకింగ్ పాలసీ విడుదల చేయడం భారతీయ ఐటీ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హెచ్-1బీ వీసా నూతన నిబంధనల ఇటు భారతీయులకేకాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం జరుగుతుందని నాస్కామ్ అధ్యక్షుడు , ఆర్.చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అటు దీంతో స్టాక్‌మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేసింది. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రచందనం అడ్డుకట్టకు తొలి ప్రాధాన్యత మరింత పటిష్టంగా డయల్ యువర్ ఎస్పీ కౌంటర్ కేసుల్లో విచారణ పటిష్టంగా ఉండాలి జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పలమనేరు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల సందర్శనలో భాగంగా శుక్రవారం ఆయన పలమనేరులోని అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. తాను జిల్లా ఎస్పీగా కొత్తగా విధుల్లో చేరినందున పోలీస్స్టేషన్లు, సిబ్బందితో పరిచయం కోసం జిల్లా మొత్తం తిరుగుతున్నట్టు తెలిపారు. అందరూ నాకెందుకులే అనుకోకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ అయ్యే ప్రసక్తే లేదన్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో క్రైమ్ వివరాలను అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై జిల్లాలోని సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తామన్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందిని పూర్తిగా తగ్గించేందుకు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అందుకే తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు డ్రైవర్లలో చైతన్యం తీసుకొస్తామన్నారు. దీనికి ప్రజల నుంచి సహకారం ఉండాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తమ వద్ద సమాచారం ఉందని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు కర్ణాటక, అటు తమిళనాడుకు ఎర్రచందనం తరలకుండా పూర్తి స్థాయి లో నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. తమ ముందున్న సవాళ్లలో మొదటి ప్రాధాన్యం ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడమేనన్నారు. భవిష్యత్తులో సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్ తదితరాలకు స్థలాల సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే జిల్లాలోని పోలీస్ ఆస్తులను ఈ అవసరాల కోసం ఉపయోగించుకునేలా పథకం సిద్ధం చేశామన్నారు. ఇక కౌంటర్ కేసుల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసుల విచారణ పటిష్టంగా ఉండాలన్నారు. ఎవరు ఫిర్యాదు ఇచ్చినా దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో)పై ఉంటుందన్నారు. అయితే విచారణలో తప్పుడు కేసులను రెఫర్ చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి కేసులను తాము 98 వరకు గుర్తించి వాటిని రెఫర్ చేశామని పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమ్నాన్ని మరింత పటిష్టంగా నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. గత ఎస్పీ ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ వెంట పలమనేరు, గంగవరం సీఐలు బాలయ్య, రామక్రిష్ణ, ఎస్ఐలు రవినాయక్ తదితరులు ఉన్నారు.