సోషల్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఐఎస్‌బీ–ఎస్‌ఏపీ మధ్య ఒప్పందం
హైదరాబాద్: వ్యాపార దృక్పథం మాత్రమే కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి ఆరంభించే స్టార్టప్‌లను ప్రోత్సహించాలని ఐఎస్‌బీ, ఎస్‌ఏపీ ల్యాబ్ ఇండియా నిర్ణయించాయి. గురువారమిక్కడి ఐఎస్‌బీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు సంస్థలూ ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీన్లో భాగంగా జంప్‌స్టార్ట్ సోషల్ ఎంటర్‌ప్రైజ్ యాక్సిలరేటర్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి.
ప్రారంభదశలో ఉన్న 10 స్టార్టప్‌లకు, అభివృద్ధి చెందుతూ సాగుతున్న మరో 5 స్టార్టప్‌లకు ఈ యాక్సిలరేటర్ ద్వారా చేయూతనిస్తారు. వీటికి పూర్తి స్థాయి గైడెన్స్, మెంటర్‌షిప్, స్కేలింగ్ అప్, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటివి అందిస్తారు. ప్రధానంగా విద్య, వైద్యారోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వ్యవసాయం, టెక్నాలజీ స్టార్టప్‌లను దీనికింద ఎంపి క చేస్తారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఎస్‌ఏపీ ల్యాబ్ ఇండియా ఎండీ దిలీప్‌కుమార్ ఖండేల్‌వాల్ తదితరులు పాల్గొన్నారు.