ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ‘భారతీ సిమెంట్స్’ | engineers first selection is bharathi cements | Sakshi
Sakshi News home page

ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ‘భారతీ సిమెంట్స్’

Published Wed, May 28 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ‘భారతీ సిమెంట్స్’

ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ‘భారతీ సిమెంట్స్’

తిరుపతి, న్యూస్‌లైన్ : స్థాపించిన అతి తక్కువ కాలంలోనే భారతీ సిమెంట్స్ అందరి మన్ననలు పొంది ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ఉత్పత్తిగా అభివృద్ధి సాధించిందని భారతీ సిమెంట్స్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎంసీ. మల్లారెడ్డి అన్నారు. భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతిలో ఇంజనీర్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతీ
 సిమెంట్స్ కంపెనీ వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్‌ను సరఫరా చేయడం ద్వారా అనతికాలంలోనే విశేష అభివృద్ధి సాధించిందన్నారు.

ఇంజనీర్స్ సేవలకే కాకుండా వినియోగదారులు, తాపీ మేస్త్రీలకు సైతం లక్ష రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్(టెక్నికల్ సర్వీస్) సతీష్. టెక్నికల్ మేనేజర్ ఓబుళరెడ్డి,  పలువురు ఇంజనీర్లు, డీలర్లు, సబ్ డీలర్లు పాల్గొన్నారు.  అనంతపురం జేఎన్‌టీయూకు చెందిన శశిధర్ రీయూస్‌ఫుల్ కాంక్రీట్ ద్వారా ఏ విధంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చో ఈ కార్యక్రమంలో తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement