మాజీ మైనారిటీ వాటాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ మాజీ మైనారిటీ వాటాదారులకు ఎస్సార్ గ్రూపు తీపి కబురు అందించింది. ఒక్కో షేరుకు రూ.75.48 చొప్పున అదనంగా చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఇతర ఇన్వెస్టర్ల కూటమి 12.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఈ విక్రయానికి ముందే 2015లో ఎస్సార్ ఆయిల్‌ను స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి ఎస్సార్ గ్రూపు డీలిస్ట్ చేసింది. ఆ సమయంలో బైబ్యాక్‌లో పాల్గొన్న ఇన్వెస్టర్లకు వారి దగ్గరున్న ఒక్కో షేరుకు రూ.262.80 చొప్పున చెల్లించింది. తాజాగా ఎస్సార్ ఆయిల్‌ను రాస్‌నెఫ్ట్‌కు విక్రయించగా, ఒక్కో షేరుకు రూ.338.28 చొప్పున తమకు చెల్లింపులు జరిగాయని, ఈ నేపథ్యంలో ఒకనాటి మైనారిటీ వాటాదారులకు గతంలో చెల్లించిన రూ.262.80కు అదనంగా ఇప్పుడు ఒక్కో షేరుకు రూ.75.48 చొప్పున చెల్లించనున్నట్టు ఎస్సార్ గ్రూపు తెలిపింది.
ఎస్సార్ ఆయిల్ షేరుకు అదనంగా రూ.75.48
Published Wed, Aug 23 2017 12:55 AM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM
Advertisement
Advertisement