ఫియట్ నుంచి డ్రైవ్ కూల్ క్యాంప్
హైదరాబాద్: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా కంపెనీ డ్రైవ్ కూల్ కాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. దక్షిణ భారత దేశంలో అన్ని ఫియట్ డీలర్షిప్‌ల వద్ద ఈ డ్రైవ్ కూల్ కాంప్ ఈ నెల 11న ప్రారంభమైందని, ఈ నెల16న ముగుస్తుందని ఫియల్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజుల పాటు జరిగే ఈ కాంపెయిన్‌లో ఫియట్ కార్ల యజమానులు పలు ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ ప్రెసిడెంట్, ఎండీ కెవిన్ ఫ్లెన్ పేర్కొన్నారు. కార్ల ఏసీలను ఉత్తమ స్థాయిలో రిపేర్ చేసిస్తామని, వాహన విడిభాగాలపై ప్రత్యేక డిస్కౌంట్లనిస్తామని, కార్ చెకప్ ఉచితమని, మెకానికల్ రిపేర్లకు సంబంధించిన లేబర్ చార్జీల్లో 10 శాతం డిస్కౌంట్‌నిస్తామని వివరించారు.