భారత్‌ను వర్ధమాన దేశమంటారెందుకు?
అభివృద్ధి చెందుతున్న దేశాలను వర్ధమాన దేశాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్లకు అధిక రాబడి అవకాశాలు అందుబాటులో ఉంటాయో వాటిని వర్ధమాన దేశాలుగా పేర్కొం టారు. ఇక్కడ పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోరు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లు, డెట్ మార్కెట్లు, మంచి జీడీపీ వృద్ధి రేటు, సంస్కరణలు వంటి అంశాలను మనం గమనించవచ్చు. అందుకే భారత్ వర్ధమాన దేశాల జాబితాలో చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్లకు అధిక రాబడి పొందొచ్చు. ఇక్కడ అధిక రాబడికి సమానంగానే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
రిస్క్ ఎక్కువగా ఉందంటే.. మార్కెట్ ధర స్థిరంగా ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో రిస్క్‌లు తక్కువే. ఇండియన్ మార్కెట్లలో బలమైన దీర్ఘకాలిక వృద్ధి కనిపిస్తుంది. దీనికి అధిక జనాభా, ప్రజాస్వామ్య వ్యవస్థ, వృద్ధి అవకాశాలు, ఆర్థిక అంశాల రికవరీ వంటి పలు అంశాలను కారణంగా పేర్కొనవచ్చు. సుసంపన్న, సమాన వృద్ధి స్థాయిల పరంగా చూస్తే భారత్ ఇతర వర్ధమాన దేశాల కన్నా వెనుకంజలో ఉంది. అంటే ఇక్కడ వృద్ధికి అపార అవకాశాలున్నాయి. కాగా సంస్థాగత విధానాలు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ వంటి సమస్యల్ని భారత్ ఎదుర్కొంటోంది.
ఫైనాన్షియల్ బేసిక్స్
Published Mon, Jan 2 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
Advertisement