కోచి: నిధుల్లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ తెలిపారు. భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖా మంత్రి అయిన ఆయన సోమవారం కోచి వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, అదే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక సహకారం అవసరం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రోత్సహించాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందున్న అధిక ప్రాధాన్యం ఇదే’’ అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment