సాక్షి, న్యూఢిల్లీ : పరిశ్రమ అవసరాలకు, సిలబస్‌కు మధ్య నెలకొన్న గ్యాప్‌ను తొలగించేందుకు ఏఐసీటీఈ చొరవ తీసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచేందుకు ఆయా కరిక్యులమ్‌ను పాఠ్యాంశాల్లో జోడించాలని కళాశాలలకు సూచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలను సిలబస్‌లో పొందుపరిచేందుకు కసరత్తు సాగుతోంది. ఏఐసీటీఈ నిర్ణయంతో దేశంలోని 3000 ఇంజనీరింగ్, సాంకేతిక కళాశాలల్లో నూతన కరిక్యులమ్ అందుబాటులోకి రానుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స వంటి నూతన టెక్నాలీజీలపై ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పట్టు ఉండేలా నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ, పంజాబ్ టెక్ యూనివర్సిటీ, వైఎంసీఏ ఫరీదాబాద్ సన్నాహాలు చేస్తున్నాయి. అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్ స్ధాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పూర్తి సెమిస్టర్ ఉంటుందని, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు సైతం నూతన టెక్నాలజీలపై దృష్టిసారిస్తున్నాయని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ఇక ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వచ్చే నూతన గ్రాడ్యుయేట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దీటుగా పనిచేయగల సామర్థ్యం అందిపుచ్చుకుంటారని చెప్పారు. నూతన టెక్నాలజీలపై ఫ్యాకల్టీలకు శిక్షణ ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఈ-కోర్సులను రూపొందిస్తోందని చెప్పారు. మరోవైపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నూతన టెక్నాలజీలపై అవగాహన కల్పించే కోర్సులు ప్రవేశపెడుతుండటం పట్ల ఐటీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment