ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు బంపర్ అవకాశం
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు బంపర్ అవకాశం
Published Tue, Aug 8 2017 9:37 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఓ సరికొత్త ప్రొగ్రామ్‌ను లాంచ్ చేసింది. 'బడ్డింగ్ స్టార్ ప్రొగ్రామ్' పేరుతో ఉద్యోగులు తమకు నచ్చిన జాతీయ లేదా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేలా అవకాశం కల్పిస్తోంది. అయితే దీనికి కంపెనీలో ఆరు నెలల పాటు ఉద్యోగం చేసిన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్నల్ కంపెనీ ప్యానల్ ఎంపికచేసిన ఉద్యోగులు ఈ ప్రొగ్రామ్‌కు షార్ట్ లిస్టు అవుతారు. వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఉద్యోగులు వారు పంపిన ప్రతిపాదనలకు వారం రోజుల్లో అంగీకారం తెలిపి, ఆమోదం తెలిపిన ఐదు రోజుల్లోనే ఆర్థిక సాయం కూడా అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ చెప్పింది.
రోజు చేసే పనికి మించి, ఉద్యోగుల్లో ఉన్న ఆసక్తిని వెలికితీయడానికి ఈ ప్రొగ్రామ్ ఫ్లిప్‌స్టర్స్‌కు అవకాశం ఇస్తోందని ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్‌టోటల్ రివార్డ్స్ సతీష్ కేవీ చెప్పారు. ఒకవేళ తమ కస్టమర్లకు ఆనందం చేకూర్చాలని తాము భావిస్తే, అదే సంతోషం, ఆనందం ఉద్యోగులకు కల్పించడం అవసరమని చెప్పారు. వర్క్‌ప్లేస్‌లో ఉద్యోగులకు సంతోషంగా ఉంచడంతో ఉత్పాదకత పెరుగుతుందని అంతేకాక, తమ చుట్టుపక్కల ఉన్న ప్రజలపై కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్‌లో ప్రభుత్వ అధికారులు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లు, నాన్-స్పోర్ట్స్ ఈవెంట్లు ఉంటాయి. కానీ ఇది స్థానిక లేదా రాష్ట్ర స్థాయి పోటీలకు సపోర్టు చేయదు. టూరిస్ట్ కార్యకలాపాలకు కూడా ఇది వర్తిచదని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
Advertisement
Advertisement