పసిడి ధర అక్కడి కన్నా...ఇక్కడ ఎక్కువే!
• అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే భారత్‌లో అధిక ధర
• రెండేళ్ల గరిష్ట స్థారుుకి ప్రీమియం
• దిగుమతుల రద్దు భయాలు కారణం
ముంబై: పసిడి ఇక్కడి ప్రధాన స్పాట్ మార్కెట్‌లో ధర అంతర్జాతీయ ధరకన్నా అధికంగా ఉంది. దేశీ, అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. పుత్తడి దిగుమతులు రద్దవుతాయన్న భయాలు కొనుగోళ్ల డిమాండ్‌కు తదనుగుణంగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నల్లధనం కట్టడి దిశలో తొలి అడుగుగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం తదుపరి చర్య పసిడి దిగుమతుల నిషేధమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి ఔన్‌స (31.1గ్రా) ధర 1,210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
10% దిగుమతి పన్నుసహా అధికారిక దేశీయ ధరలకన్నా అధికంగా 12 డాలర్లు అధికం గా (అంతర్జాతీయ ధరతో పోల్చితే) డీలర్లు ప్రీమియం వసూలు చేశారు. గడచిన వారం ఈ ప్రీమియం కేవలం ఆరు డాలర్లే ఉండడం గమనార్హం. ముంబై స్పాట్ బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర శుక్రవారం 10 గ్రాములకు రూ.29,310గా ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ ధర, దిగుమతి సుంకం కలిపి చూస్తే ఇది రూ. 28,750 సమీపంలోనే ఇక్కడ లభించాలి. కానీ ఇక్కడి స్పాట్ మార్కెట్లో అధిక ప్రీమియంతో ట్రేడవుతోంది.
చైనాలోనూ ఇదే పరిస్థితి...: పసిడి డిమాండ్‌కు భారత్‌కన్నా కొంచెం ముందున్న చైనాలోనూ అంతర్జాతీయ మార్కెట్ ధరకన్నా 10 డాలర్లు అధికంగా పసిడి ప్రీమియం నడుస్తోంది. కరెన్సీ యువాన్ విలువ ఇటీవల పతనం దీనికి నేపథ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు అంచనాలతో పసిడి ధర భారీగా పడిపోవడం తెలిసిందే.
డిమాండ్ ఉన్నా... ఇబ్బంది...: కాగా పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా పసిడికి మంచి డిమాండ్ ఉందని ఆమ్రపాలీ గ్రూప్ డెరైక్టర్ చిరాగ్ టక్కర్ పేర్కొన్నారు. అరుుతే ఇప్పుడు సమస్యల్లా కరెన్సీ రద్దు ప్రభావమేనని ఆయన తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌పై కరెన్సీ రద్దు ప్రతికూల ప్రభావం ఉందని తెలిపారు.