spot market
-
వెండి మిలమిల..
న్యూఢిల్లీ: వెండి కేజీ ధర న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఒకేరోజు రూ.5,200 పెరిగి రూ.95,800కు చేరింది. వెండి ధర ఒకేరోజు ఈ స్థాయిలో ఎగియడం ఒక రికార్డు. తద్వారా ఈ మెటల్ ధర రెండు వారాల తర్వాత తిరిగి రూ.95,000పైకి చేరింది. కాగా, ఇంతక్రితం అక్టోబర్ 21న వెండి ధర ఒకేరోజు రూ.5,000 పెరగడం ఒక రికార్డు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, స్థానిక ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ దీనికి కారణం. రెండు రోజుల తర్వాత పసిడి ఇక గడచిన రెండు రోజుల్లో రూ.2,250 పడిపోయిన బంగారం ధర బుధవారం తిరిగి పుంజుకుంది. 99.9 ప్యూరిటీ పసిడి ధర రూ.650 ఎగసి రూ.78,800కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 శాతం స్వచ్ఛత ధర రూ.950 ఎగసి రూ.78,700కు ఎగసింది. డాలర్ విలువలో ఒడిదుడుకులు తాజా పసిడి పరుగుకు కారణం. అబాన్స్ హోల్డింగ్స్ సీఈఓ చింతన్ మెహతా పసిడి భవిష్యత్ ధరలపై మాట్లాడుతూ, బులియన్ ధరలకు మరింత దిశానిర్దేశం చేసే రష్యా–ఉక్రెయిన్ వివాదం, పరిణామాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తాయని అన్నారు. ఫ్యూచర్స్‌లో పరుగు.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో 1% పెగా (32 డాలర్లు) పెరిగి 2,679 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ ఇటీవలే పసిడి 52 వారాల గరిష్టం 2,826 డాలర్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ, ట్రంప్ గెలుపు, డాలర్ స్థిరత్వం వంటి పరిణామాలతో ఎల్లో మెటల్ కొంత వెనక్కు తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ. 900 లాభంతో రూ. 76,870 వద్ద ట్రేడవుతోంది. -
వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్
-
వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్
ఐదు వారాల కనిష్టానికి పతనం ముంబై: డాలర్ బలోపేతం, అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు అవకాశాల వార్త నేపథ్యంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ ధర ఫిబ్రవరి 1 స్థాయికి చేరింది. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన 10 రోజుల్లో పసిడి దాదాపు 45 డాలర్లు తగ్గింది. దేశీయంగానూ ఇదే ధోరణి కనబడుతోంది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో వరుసగా 5 రోజులుగా పసిడి పడు తోంది. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.205 తగ్గి రూ.28,790 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి 28,640 వద్ద ట్రేడవుతోంది. కాగా వెండి కేజీ ధర రూ.525 తగ్గి రూ.41,775కు చేరింది. -
పసిడి ధర అక్కడి కన్నా...ఇక్కడ ఎక్కువే!
• అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే భారత్‌లో అధిక ధర • రెండేళ్ల గరిష్ట స్థారుుకి ప్రీమియం • దిగుమతుల రద్దు భయాలు కారణం ముంబై: పసిడి ఇక్కడి ప్రధాన స్పాట్ మార్కెట్లో ధర అంతర్జాతీయ ధరకన్నా అధికంగా ఉంది. దేశీ, అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. పుత్తడి దిగుమతులు రద్దవుతాయన్న భయాలు కొనుగోళ్ల డిమాండ్‌కు తదనుగుణంగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నల్లధనం కట్టడి దిశలో తొలి అడుగుగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం తదుపరి చర్య పసిడి దిగుమతుల నిషేధమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి ఔన్స (31.1గ్రా) ధర 1,210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 10% దిగుమతి పన్నుసహా అధికారిక దేశీయ ధరలకన్నా అధికంగా 12 డాలర్లు అధికం గా (అంతర్జాతీయ ధరతో పోల్చితే) డీలర్లు ప్రీమియం వసూలు చేశారు. గడచిన వారం ఈ ప్రీమియం కేవలం ఆరు డాలర్లే ఉండడం గమనార్హం. ముంబై స్పాట్ బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ధర శుక్రవారం 10 గ్రాములకు రూ.29,310గా ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ ధర, దిగుమతి సుంకం కలిపి చూస్తే ఇది రూ. 28,750 సమీపంలోనే ఇక్కడ లభించాలి. కానీ ఇక్కడి స్పాట్ మార్కెట్లో అధిక ప్రీమియంతో ట్రేడవుతోంది. చైనాలోనూ ఇదే పరిస్థితి...: పసిడి డిమాండ్‌కు భారత్‌కన్నా కొంచెం ముందున్న చైనాలోనూ అంతర్జాతీయ మార్కెట్ ధరకన్నా 10 డాలర్లు అధికంగా పసిడి ప్రీమియం నడుస్తోంది. కరెన్సీ యువాన్ విలువ ఇటీవల పతనం దీనికి నేపథ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు అంచనాలతో పసిడి ధర భారీగా పడిపోవడం తెలిసిందే. డిమాండ్ ఉన్నా... ఇబ్బంది...: కాగా పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా పసిడికి మంచి డిమాండ్ ఉందని ఆమ్రపాలీ గ్రూప్ డెరైక్టర్ చిరాగ్ టక్కర్ పేర్కొన్నారు. అరుుతే ఇప్పుడు సమస్యల్లా కరెన్సీ రద్దు ప్రభావమేనని ఆయన తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌పై కరెన్సీ రద్దు ప్రతికూల ప్రభావం ఉందని తెలిపారు. -
వెండి వెలుగులు..
♦ మళ్లీ రూ.45 వేలపైకి ♦ రెండేళ్ల గరిష్ట స్థాయి పసిడిదీ అప్‌ట్రెండే ముంబై: వెండి ధర ఇక్కడ ప్రధాన స్పాట్ మార్కెట్లో శుక్రవారం భారీగా పెరిగింది. కేజీకి రూ. 1,520 లాభపడి రూ. 45,080 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. పరిశ్రమలు పుంజుకుంటాయని, దీనితో యంత్ర పరికరాల్లో వినియోగానికి సంబంధించి ఈ మెటల్ డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు వెండి పరుగుకు కారణం. కాగా పసిడి 99.9, 99.5 స్వచ్ఛత ధర కూడా రూ.185 చొప్పున లాభపడ్డాయి. ఈ ధరలు వరుసగా, రూ. 30,895, రూ.30,745 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, దేశీయంగా ఇన్వెస్టర్ల డిమాండ్ వంటి అంశాలు పసిడి పటిష్టతకు కారణం. కాగా శుక్రవారం కడపటి సమాచారం అందే సరికి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ఔన్స్(31.1గ్రా) ధర 19 డాలర్ల లాభంతో 1,339 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 19 డాలర్ల పైన లాభంలో ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్‌లో పసిడి రూ. 300 లాభంతో రూ.31,497 వద్ద ట్రేడవుతుండగా, వెండి కేజీకి భారీగా రూ.1,844 లాభంతో రూ. 45,311 వద్ద ట్రేడవుతోంది. -
పసిడికి ‘దేశీయ’ మెరుపు!
ముంబైలో రూ. 525 పెరుగుదల; రూ.29,000 పైకి జంప్... ముంబై: దేశీయంగా నెలకొన్న పటిష్ట డిమాండ్, శుక్రవారం నాడు పసిడికి మెరుపునిచ్చింది. ముంబై స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర గురువారం ముగింపుతో పోల్చిచూస్తే.. రూ.525 ఎగసి రూ.29,095కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగసి రూ.28,945 పెరిగింది. ఇక వెండి కేజీ ధర రూ.395 ఎగసి రూ.37,690కి పెరిగింది. ముంబైలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రధాన స్పాట్ మార్కెట్లు అన్నింటిలో పసిడి ధర శుక్రవారం భారీగా ఎగసింది. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, స్టాకిస్టులు, ఆభరణాల వర్తకుల కొనుగోళ్లు తాజా డిమాండ్‌కు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కడపటి సమాచారం అందేసరికి అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లలో కూడా పసిడి లాభాల్లోనే ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు ఐదు డాలర్ల లాభంతో 1,231 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో రూ.250 లాభంతో రూ.29,560 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి జోరుకు బ్రేక్!
♦ లాభాల స్వీకరణతో వెలవెల! ♦ దేశీయ, అంతర్జాతీయ ♦ మార్కెట్లలోనూ ఇదే ధోరణి... న్యూయార్క్/ముంబై: వారం రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టిన పసిడి నుంచి ఇన్వెస్టర్లు సోమవారం లాభాలు స్వీకరిస్తున్నారు. కడపటి సమాచారం అందే సరికి నెమైక్స్ గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే 35 డాలర్లు తగ్గి 1,205 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో సైతం కడపటి సమాచారం అందేసరికి 10 గ్రాముల పసిడి ధర 724 నష్టంతో రూ.28,662 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర వెయ్యి రూపాయలకుపైగా నష్టంతో రూ.36,970 వద్ద ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పసిడి ధర మంగళవారం దేశీయ స్పాట్ మార్కెట్లో పడిపోయే అవకాశం ఉంది. ఇతర కారణాలు ఏమిటంటే... జపాన్, యూరప్‌లు ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపనలను ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా పసిడి క్షీణతకు ఒక కారణం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గి, పసిడి నుంచి నిధులను వెనక్కు తీసుకోడానికి దోహదపడుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ మార్కెట్లో భారీ తగ్గుదల: గత వారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,700 వరకూ పెరిగిన పసిడి ధర సోమవారం భారీగా తగ్గింది. ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 ప్యూరిటీ ధర రూ.695 తగ్గి రూ. 28,565 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 28,415 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర సైతం రూ.965 పడిపోయి 37,210 వద్దకు చేరింది. పసిడి, వెండి టారిఫ్ ధరల పెంపు పసిడి దిగుమతుల టారిఫ్ ధరను సోమవారం ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ 388 డాలర్ల నుంచి 403 డాలర్లకు పెంచింది. వెండి ధరను కేజీకి 487 డాలర్ల నుంచి 510 డాలర్లకు పెంచింది. -
స్పాట్ మార్కెట్లో మరింత పెరిగిన బంగారం
ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ ఫలితంగా ముంబై బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర మరింత పెరిగింది. గురువారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ ధర రూ. 30,000 దాటినప్పటికీ, శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఇది తగ్గింది. దాంతో ముంబై స్పాట్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర మరో రూ. 275 మాత్రమే పెరిగి రూ. 29,260 వద్ద, ఆభరణాల బంగారమూ అంతే పెరుగుదలతో రూ. 29,110 వద్ద ముగిసింది. ఇది 20 నెలల గరిష్టానికి ఎగిసింది. ఇక వెండి రేటు కేజీకి రూ. 175 పెరిగి రూ. 38,175కి చేరింది. అటు ఢిల్లీలో రూ. 850 మేర పెరిగి రూ. 29,650 వద్ద ముగిసింది. 2014 మే 16 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. న్యూయార్క్ ట్రేడింగ్‌లో కడపటి సమాచారం అందేసరికి ఔన్సు పుత్తడి ధర క్రితం ముగింపుకంటే 13 డాలర్లు క్షీణించి 1,235 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం ధర మళ్లీ రయ్...
ముంబై /లండన్ : అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సెప్టెంబర్‌లో పెంచబోదన్న అంచనాలతో గురువారం విదేశీ, దేశీయ మార్కెట్లలో పుత్తడి ధర జోరుగా పెరిగింది. ముంబై స్పాట్ మార్కెట్లో 99.5 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు రూ. 465 ఎగిసి రూ. 26,500 వద్ద ముగిసింది. ఇది నెలన్నర రోజుల గరిష్టస్థాయి. ఇక్కడ స్పాట్ మార్కెట్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర ఒక్కసారిగా 24 డాలర్లు పెరిగి నెలరోజుల గరిష్టస్థాయి 1,148 డాలర్ల వద్దకు చేరింది. ఇదే ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫ్యూచర్ ధర రూ. 600 మేర పెరిగి రూ. 26,800 స్థాయికి చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడి స్పాట్ మార్కెట్లో పుత్తడి మరికొంత పెరగవచ్చని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. -
మూడు నెలల కనిష్టానికి పసిడి
ముంబై : బంగారం ఇక్కడ ప్రధాన బులియన్ మార్కెట్లో బుధవారం 3 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం ముగింపుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.155 తగ్గి రూ.26,100కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర అదే స్థాయిలో తగ్గి రూ.25,950కి పడింది. వెండి కూడా భారీగా రూ.1,130 తగ్గి రూ.35,115కు జారింది. కారణాలు : అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకుల ధోరణి నేపథ్యంలో స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు స్పాట్ మార్కెట్లో పసిడి నష్టాలకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమల నుంచి డిమాండ్ తగ్గడం పసిడి ధరపై ప్రతికూలత చూపుతోందనీ విశ్లేషిస్తున్నాయి. చైనా వృద్ధిపై అనుమానాలు.. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు... ఈ నేపథ్యంలో డాలర్ బలపడ్డం వంటి అంశాలు విలువైన మెటల్స్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ధర ఔన్స్‌కు (31.1 గ్రా) 1,160 డాలర్ల స్థాయిలో తిరుగుతుండగా, వెండి విషయంలో ఈ రేటు 15 డాలర్లుగా ఉంది. -
25,500 స్థాయికి పుత్తడి తగ్గొచ్చు
ఇండియా రేటింగ్స్ అంచనా - ఈ ఏడాది అంతర్జాతీయ ధరలకు - సమానంగా దిగిరాకతప్పదని విశ్లేషణ ముంబై: దేశీయంగా పసిడి ధర ఈ ఏడాది(2014-15)లో ఇప్పటి అంతర్జాతీయ ధరకు సమానంగా దిగివస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ గురువారం అంచనావేసింది. ఈ ధర 10 గ్రాములకు రూ.25,500, రూ.27,500 స్థాయికి పడుతుందని పేర్కొంది. ప్రస్తుత తీరు: అంతర్జాతీయ ధరతో పోల్చితే, దాదాపు రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ అధిక ప్రీమియంతో ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర ఉంది. స్పాట్ మార్కెట్లో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దాదాపు రూ.30,000 స్థాయిలో కదలాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా పసిడి దిగుమతులపై కేంద్రం 10% కస్టమ్స్ సుంకాలను అమలుచేస్తోంది. ఆభరణాల దిగుమతులకు సంబంధించి ఈ రేటు 15%గా ఉంది. క్యాడ్ కట్టడి నేపథ్యంలో దేశీయంగా సుంకాలు తగ్గించేస్తే... ప్రీమియంలు పడిపోయి, పసిడి ధర అంతర్జాతీయ ధరకు సమాన స్థాయికి వచ్చే అవకాశం ఎలానూ ఉంది. ఆయా అంశాలను పక్కనబెడితే, కేవలం విధానపరమైన విశ్లేషణకు ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో ప్రాధాన్యత ఇచ్చింది. విశేషాలు ఇవీ... * ప్రస్తుతం నెమైక్స్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 1,300 డాలర్లు పలుకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ ధర 1,150-1,250 డాలర్లకు తగ్గవచ్చు. * దీంతో బంగారం ధరకు ‘ప్రతికూల అవుట్‌లుక్’ను ఇస్తున్నాం. * అమెరికా, యూరోజోన్ జీడీపీలు మరింత పటిష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. పసిడిలో పెట్టుబడులు క్యాపిటల్ మార్కెట్లకు తరలే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరింత పడిపోవచ్చు. *అమెరికా ఆర్థికాభివృద్ధి, సహాయక చర్యల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపు.. ఇవన్నీ బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరిచేవే. *ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు సైతం తగ్గే అవకాశం ఉంది. * అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో జీడీపీ వృద్ధి రేట్లు అంచనాలకన్నా తగ్గినా, కొన్ని దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగినా, చైనా ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితులు ఏర్పడినా... బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 1,300 డాలర్లను దాటే అవకాశం ఉంది.